నల్లగొండ టూటౌన్: ఎయిడ్స్‌పై అవగాహన కల్పించడంలో భాగంగా జిల్లా పరిధిలోని రెడ్ రిబ్బన్ క్లబ్ కళాశాలల్లో ఈనెల 24, 25 తేదీల్లో జిల్లా స్థాయిలో జాతీయ సేవా పథకం వలంటీర్లకు వ్యాసరచన, ఉపన్యాసం, నాటిక, పాటలు, పోస్టర్ డిజైనింగ్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని జాతీయ సేవా పథకం మహాత్మాగాంధీ యూనివర్సిటీ సమన్వయకర్త డాక్టర్ మద్దిలేటి తెలిపారు. గురువారం ఎంజీ యూనివర్సిటీలో నిర్వహించిన జిల్లాలోని వివిధ కళాశాలల జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పోటీలకు సిద్ధం కావాలని వలంటీర్లకు సూచించారు. సమావేశంలో ఎం.వెంకట్‌రెడ్డి, సుల్తానా షేక్, మీనాక్షి, డాక్టర్ ఆనంద్, శేఖర్, బి.విరస్వామి, డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, సీహెచ్.రాజు, జె.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment