ఆర్‌ఓబీలు మంజూరు చేయాలి
నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాల నివారణకు ఆర్‌ఓబీ, ఆర్‌యూబీలను మంజూరు చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. మంత్రి సీతక్క, భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి రైల్వే మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రైళ్ల రాకపోకల సమయంలో లెవల్ క్రాసింగ్‌ల వద్ద గేట్లు మూసివేయడం వల్ల రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడడంతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. లెవెల్ క్రాసింగ్‌ల వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని కోరారు. నల్లగొండ జిల్లా రాయనిగూడెం వద్ద, నల్లగొండలోని ఎఫ్‌సీఐ గోడౌన్ నుంచి పెద్దబండ నాంరోడ్డు వద్ద, నార్కట్‌పల్లి – మునుగోడు రోడ్డులో, దామరచర్ల – వీర్లపాలెం రోడ్డులో, త్రిపురారం – కుక్కడం రోడ్డులో, యాదాద్రి జిల్లా చౌటుప్పల్ – నాగారం రోడ్డులో, పగిడిపల్లి – భువనగిరి రోడ్డులో, ముత్తిరెడ్డిగూడెంలోని భువనగిరి – రాయగిరి రోడ్డులో, వలిగొండ – రామన్నపేట రోడ్డులోని కిలోమీటర్ 16/8 నుంచి 17/0 వరకు, రామన్నపేట–చిట్యాల జంక్షన్‌లోని కిలోమీటర్ 0/4–6 వద్ద, చిట్యాల మున్సిపాలిటీ కాటన్ రైస్ ఇండస్ట్రీస్ రోడ్డులో.. ఆర్‌ఓబీ, ఆర్‌యూబీల నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు.
ఫ రైల్వే శాఖ మంత్రికి కోమటిరెడ్డి వినతి
Comments
Please login to add a commentAdd a comment