సివిల్ రైట్స్‌డే నిర్వహించాలి
నల్లగొండ : షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై దాడుల నివారణ, అంటరానితనంపై అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో ప్రతినెలా చివరి వారంలో సివిల్ రైట్స్ డేను నిర్వహించాని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకతి లక్ష్మీనారాయణతో కలిసి.. ఎస్సీ, ఎస్టీలపై దాడులు, వారి భూముల సమస్యలు తదితర అంశాలపై సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులకు తెలిపిన వివరాలను సావధానంగా విని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకోసారి జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. నియామకాలు, ప్రమోషన్ల విషయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు.
నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహం
మున్సిపల్ సిబ్బందిని మున్సిపాలిటీల్లో కాకుండా నాయకుల ఇళ్లలో పని చేయించడం ఏంటని చైర్మన్ వెంకటయ్య నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలోని కొందరు ఉద్యోగులే తన దృష్టికి తెచ్చారని.. ఈ పద్ధతి మార్చుకోవాలన్నారు. కొందరు అభిమానులు తన ఫ్లెక్సీ పెడితే.. వెంటనే తీసివేయించారట.. ఏమైనా ఎన్నికల కోడ్ ఉందా అని కమిషనర్‌ను ప్రశ్నించారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి వద్దకు దళితులు ఎవరైనా కేసులపై వెళ్తే.. అమర్యాదగా వ్యవహరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చింద ఇలా చేయడం సరి కాదన్నారు. దీంతో డీఎస్పీ అలాంటి సంఘటనలు జరగలేదని తెలిపారు. స్పందించిన ఎస్పీ శరత్‌చంద్ర పవార్ డీఎస్పీ ముక్కుసూటిగా మాట్లాడతారని.. చైర్మన్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై భూముల సంబంధించిన కేసుల వివరాలను చైర్మన్‌కు వివరించారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించిన కేసుల వివరాలను కమిషన్ చైర్మన్‌కు నివేదించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి కోటేశ్వర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి రాజ్‌కుమార్ ఆయా శాఖలు అమలు చేస్తున్న పథకాల అమలు వివరాలను కమిషన్‌కు వివరించారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్‌ఓ అశోక్‌రెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్, ఏఎస్పీ మౌనిక తదితరులు పాల్గొన్నారు.
ఫ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి
ఫ మున్సిపల్ సిబ్బంది చేత ఇళ్లలో పనిచేయించడం సరికాదు
ఫ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
సివిల్ రైట్స్‌డే నిర్వహించాలి
Comments
Please login to add a commentAdd a comment