పథకాలు అందుతున్నాయా..
పెద్దవూర: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మంగళవారం నాగార్జునసాగర్ నుంచి కారులో హాలియా వైపు వెళ్తుండగా పెద్దవూర మండలంలోని కుంకుడుచెట్టుతండా వద్ద గిరిజన రైతులను చూసి ఆగారు. కారు దిగి వచ్చి రోడ్డు పక్కనే ఉన్న బస్టాప్‌లో కూర్చొని రైతులతో మాట్లాడారు. ఎలా ఉన్నారు.. ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది.. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. అంతా బాగుందని, కానీ.. కుంకుడుచెట్టుతండా ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు సరిగా రావడం లేదని రైతులు చెప్పారు. ఏఎమ్మార్పీ డిస్ట్రిబ్యూటరీ–8, 9 కాలువలకు ఎక్కువ నీటిని విడుదల చేయిస్తానని, సాగర్ నియోజకవర్గంలో ఒక్క ఎకరంలోనూ పంట ఎండిపోనివ్వనని వారికి జానారెడ్డి హామీ ఇచ్చారు. తన దగ్గరికి వచ్చిన గిరిజనులందరిని పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం హాలియాకు వెళ్లిపోయారు. జానారెడ్డి వెంట కాంగ్రెస్ నాయకులు కర్నాటి లింగారెడ్డి, తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, భగవాన్‌నాయక్ తదితరులు ఉన్నారు.
బస్టాప్‌లో కూర్చుని రైతులను
పలకరించిన మాజీ మంత్రి జానారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment