సాగునీటికి ఇబ్బంది లేదు
నల్లగొండ : జిల్లాలో ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న పంటలకు సాగునీరు అందించేందుకు ఇబ్బంది లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం నల్లగొండలోని పానగల్ సమీపంలో ఉన్న ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ఇరిగేషన్, రెవెన్యూ వ్యవసాయ అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాసంగిలో సాగులో ఉన్న పంటలకు సాగునీరు అందడం లేదన్న ప్రచారం వాస్తవం కాదన్నారు. నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ కింద ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు ఎలాంటి నీటి కొరత లేదన్నారు. ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 1.5 టీఎంసీలగాను 0.86 టీఎంసీల నీటిని పంటలకు విడుదల చేస్తామన్నారు. ప్రాజెక్టు కింద ఉన్న 67,000 ఎకరాలకు వారబందీ పద్ధతిలో పంట కోతకొచ్చే వరకు నీరు ఇస్తామని తెలిపారు. చివరి ఆయకట%్టుకు నీరు అందేలా.. ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని తెలిపారు. సాగు, తాగునీటి విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చన్నారు.
డి–40 కాల్వ పరిశీలన
తిప్పర్తి : మండలంలోని యర్రగడ్డలగూడెం సమీపంలో డి–40 వద్ద గల ఎల్–11 కాల్వలను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం పరిశీలించారు. అక్కడ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిప్పర్తి మండలంలోని ఎల్–11 కాలువ కింద ఉన్న మామిడాల, సర్వారం, ఇందుగుల, గోరెంకలపల్లి, గ్రామాలకు వారబంధీ ద్వారా నీరు వస్తుందని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్, ఉదయ సముద్రం ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, ఏఓ సన్నిరాజు, ఎంపీడీఓ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీఓ జానయ్య, ఇరిగేషన్ అధికారులు శివరాంప్రసాద్, అనుపమ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment