
టెండర్లలో టీడీపీ నేతల హవా!
మహానంది: దేవస్థాన పరిధిలోని డార్మెటరీ భవనంలో బుధవారం సీల్డు, బహిరంగ టెండర్లు నిర్వహించారు. టీడీపీ నేతల కనుసన్నల్లో అధికారులు నడుచుకోవడం పలు విమర్శలకు తావిచ్చింది. బహిరంగ వేలాల్లో పాల్గొనేందుకు పలువురు ఆసక్తి చూపినా టీడీపీ నేతల భయంతో ముందుకు రాలేదు. టోల్‌గేట్ల నిర్వహణ ద్వారా గతేడాది రూ. 1,71,22,535 వచ్చింది. ఈ ఏడాది రూ. 2కోట్లకు పైగా వస్తుందని ఆశించారు. టీడీపీ నేత ఒత్తిడి వల్ల ఎవరూ ముందుకు రాకపోగా ఒక్కరే డిపాజిట్ చెల్లించడంతో వాయిదా పడింది. భక్తుల పాదరక్షలు భద్రపరుచుకునేందుకు, మరుగుదొడ్ల నిర్వహణ, సంప్రదాయ దుస్తుల విక్రయాల టెండర్లు వాయిదా పడ్డాయి. పచ్చికొబ్బరి చిప్పల సేకరణకు మహానందికి చెందిన టి.నాగరాజు గత ఏడాది కంటే ఎక్కువగా రూ.14,51,051 సీల్డు టెండరు దాఖలు చేసినా ఇవ్వకపోవడంపై అధికారులపై ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. టీడీపీ నేతలు అందరూ టెండర్ల వద్దే తిష్టవేయడంపై పలు విమర్శలు వచ్చాయి. హెచ్చు మొత్తం చూపిన వారికే సీల్డు టెండర్లను కట్టబెట్టారు. సీల్డు టెండర్లలో పాల్గొనడం ఇష్టం లేదని లేఖలు రాసివ్వాలని కొందరిపై టీడీపీ నేతలు ఒత్తిళ్లు చేశారు.
● అభిషేక సామగ్రి విక్రయించుకునే విభాగాన్ని మహానందికి చెందిన మురళీకృష్ణ రూ. 60,00,100, నవగ్రహాల వద్ద దీపారాధన సామగ్రికి టి.నాగరాజు రూ. 43లక్షలు, సెల్‌పాయింట్, క్లోక్‌రూమ్ నిర్వహణకు శ్రీనగరం గ్రామానికి చెందిన నాగేంద్ర రూ. 21.96లక్షలు, తలనీలాల సేకరణను హిందూపురం పట్టణానికి చెందిన రాజ రూ. 7.80లక్షలతో దక్కించుకున్నారు. మిగిలిన వాటికి మార్చి 4న తిరిగి వేలాలు నిర్వహిస్తామని ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
వాయిదా పడిన వాటికి
మార్చి 4న వేలాలు

టెండర్లలో టీడీపీ నేతల హవా!
Comments
Please login to add a commentAdd a comment