
15న ‘స్వచ్ఛత’
నంద్యాల: ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాల్లో ఈనెల 15న స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో తాగునీరు, పారిశుద్ధ్యం, స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ గ్రీన్ లీఫ్ రేటింగ్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి సంపద సృష్టించేలా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. క్లోరినేషన్ చేసిన నీటినే సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పైప్ లైన్ల మరమ్మతులు, రిపేర్లు ఏమైనా ఉంటే 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకోవాలన్నారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి కిచెన్ గార్డ్ ప్రమోట్ చేసేందుకు గుర్తించాలన్నారు.
కేసీ కెనాల్‌కు కృష్ణా జలాలు
పగిడ్యాల: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కేసీసీ లిఫ్ట్ నుంచి రెండు మోటార్లతో 490 క్యూసెక్కుల కృష్ణా జలాలను కేసీలోకి సరఫరా చేస్తున్నామని నీటిపారుదల శాఖ ఏఈఈ నరేష్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సుంకేసుల రిజర్వాయర్ నుంచి కేసీ కాలువకు నీటి సరఫరా నిలిచిపోయిన ఈ చర్యలు తీసుకున్నామన్నారు. ముచ్చుమర్రి నుంచి రెండు రోజులుగా నీటి సరఫరాను కొనసాగిస్తున్నామని తెలిపారు. నదిలో నీటి లెవెల్స్ పడిపోయేదాకా నీటిని పంపింగ్ చేస్తామని, అవసరమైతే మరో మోటర్‌ను కూడా ఉపయోగిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment