
ఉపాధి పనులు వేగవంతం చేయాలి
కోవెలకుంట్ల: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను వేగవంతం చేయాలని డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య సూచించారు. బుధవారం భీమునిపాడులో స్వచ్చభారత్ షెడ్ ఆవరణలో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం స్థానిక ఉపాధి పథక కార్యాలయంలో మండలంలోని టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ మార్చి నెలాఖరు నాటికి ఆర్థిక సంవత్సరం ముగియనున్న దృష్ట్యా గ్రామాల్లో అడిగిన వారందరికీ ఉపాధి పనులు చూపించాలన్నారు. వంద పనిదినాలకు దగ్గరలో ఉ న్న కుటుంబాలకు అవగాహన కల్పించి ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి పూర్తయ్యేలా పనులు కల్పించాలని పేర్కొన్నారు. కూలీలకు సగటు వేతనం రూ. 300 అందేలా పనులు చూపించాలన్నారు. గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న గోకులం షెడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని వివరించారు. సమావేశంలో ఎంపీడీఓ వరప్రసాదరావు, ఉపాధి పథక ఏపీఓ శ్రీవిద్య, ఈసీ హరికిషోర్, టెక్నికల్ అసిస్టెంట్లు జయభారత్‌రెడ్డి, పకృద్దీన్‌బాషా, రాధాదేవి, కొండా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పీడీ వెంకటసుబ్బయ్య
Comments
Please login to add a commentAdd a comment