కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు మిల్క్ యూనియన్ విజయ పాల ధరలను పెంచింది. పెంచిన పాల ధరలు ఈ నెల 16 నుంచి అమలులోకి వస్తాయని కర్నూ లు డెయిరీ అధికారులు ప్రకటించారు. విజయ గోల్డ్ (హోమోజినైజ్డ్) లీటరు ప్యాకెట్ ధర ప్రస్తుతం రూ.68 ఉండగా... రూ.70కి పెంచారు. విజయ గోల్డ్(పాశ్చురైజ్డ్/ హోమోజినైజ్డ్) 500 ఎంఎల్ ప్యాకెట్ ధర ప్రస్తుతం రూ.35 ఉండగా... రూ.36కు పెంచారు. టోన్డ్ మిల్క్ 500 ఎంఎల్ ప్యాకెట్ ధర రూ.28 నుంచి రూ.29కి, పెరుగు 450 గ్రాములు ధర రూ.34 నుంచి 35కు పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment