మనసున మనసై..
తోడునీడగా..
వైద్యంపై ఉన్న మక్కువతో వారిద్దరూ ఒక్కటయ్యారు. జీవితంలో విజయం సాధించారు. పత్తికొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కునిగిరి కల్పన, ప్రైవేట్ హాస్పి
టల్ అధినేత జంగం నీలకంఠ ప్రేమ కథ ఇదీ.. మిత్రుల సహకారంతో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఒకరికొకరు తోడునీడగా ఉంటూ ఆదర్శ దంపతులుగా పేరు సాధించారు. కునిగిరి కల్పన.. ఎంబీబీఎస్, ఆ తరువాత పీజీ పూర్తి చేసి గైనకాలజిస్టు అయ్యారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని జంగం నీలకంఠ.. సొంతంగా హాస్పిటల్ నిర్మించారు. సొంత ఊరులో ప్రజలకు వైద్యసేవలందించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాదు.. ఎళ్ల కాలం ఆ ప్రేమ నిలిచేలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాలి.
‘చూపు’ చక్కని జంట
ప్రేమించి పెళ్లి చేసుకున్న కొందరు కొద్దికాలం కూడా కలసి ఉండలేదు. అయితే చూపులేని అతనికి, కొద్దిగా చూపున్న ఆమెకు వివాహమై ఏళ్లయినా కలసిమెలసి జీవిస్తున్నారు. మహానంది మండలం సీతారామపురం గ్రామానికి చెందిన చినరాయుడు ప్రస్తుతం మహానంది తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్నారు. ఆయనకు రెండు కళ్లు కనిపించవు. తిరుపతిలో కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటున్న సమయంలో ఈయన కళ్యాణదుర్గం సమీపంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన సునీతతో పరిచయం ఏర్పడింది. ఈమెకు కొద్దిగా కళ్లు కనిపిస్తాయి. టీటీసీ చదివిన సునీతను డిగ్రీ వరకు చదివించి, చిన రాయుడు డిగ్రీ పూర్తి చేసి చైన్నెలో స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ డిసేబుల్డ్‌లో డిప్లొమా చేశారు. ఇద్దరు కులాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు.
ప్రేమ ఎంత మధురమో.. జీవితంలో స్థిరపడడం అంతే ముఖ్యమంటున్నారు ప్రేమికులు. ఆకర్షణను ప్రేమ అనుకోవద్దని సూచిస్తున్నారు. ఒకొరినొకరు అర్థం చేసుకుంటే జీవన ప్రయాణంలో ఎన్నేళ్లు గడిచినా కొత్తగానే అనిపిస్తుందనిచెబుతున్నారు. స్వచ్ఛమైన ప్రేమ కలకాలం నిలిచి ఉంటుందని, ఆర్థిక ఇబ్బందులు రానివ్వబోదని వివరిస్తున్నారు. ఎన్నో స్థలాలు.. ప్రేమ గుర్తుగా ఉండవచ్చని, మధుర జ్ఞాపకాలు అయి ఉండవచ్చని.. అయితే ప్రేమలో విజయం సాధించినప్పుడే జీవన ఆనందం కలుగుతుందని స్పష్టం చేస్తున్నారు. శుక్రవారం ప్రేమదినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
‘ప్రేమ’ రాగం..
జీవన ఆనందం
వారిద్దరి
మనసులు కలిశాయి. ఏడేళ్ల ప్రేమ ప్రయాణంలో అడ్డంకులను అధిగమించి వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. వెల్దుర్తికి చెందిన కమ్మర హేమాచారి.. పుత్తూరు లేబర్ ఆఫీసర్‌గా, తిరుపతి ఇన్‌చార్జ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కర్నూలుకు చెందిన పెరుగు ప్రత్యూష .. తిరుపతిలో ఎస్‌వీసీఈ కాలేజీలో ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. కర్నూలులోని వేర్వేరు కళాశాలల్లో డిగ్రీ చేస్తుండగా వీరికి పరిచయం ఏర్పడింది. అనంతరం స్నేహితులై.. ప్రేమ చిగురించి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఇళ్లలో వ్యతిరేకత వచ్చినా భయపడకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ఇరు కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ప్రేమికుల రోజే తమ పెళ్లి రోజు అని ఆనందంగా చెబుతున్నారు.
● నేడు ప్రేమికుల దినోత్సవం
– పత్తికొండ రూరల్/ వెల్దుర్తి/ మహానంది
మనసున మనసై..
మనసున మనసై..
మనసున మనసై..
మనసున మనసై..
Comments
Please login to add a commentAdd a comment