అను‘మతి లేని’ పనులు!
చర్యలు తీసుకోవాలి
వాటర్‌షెడ్ కింద నా ఎకరా పొలంలో ఇంకుడు గుంతలు తీశారు. నా అనుమతి లేకుండా ఎందుకు గుంతలు తీశారు.. అని ప్రశ్నస్తే బిల్లుల కోసం పొరపాటున తీశాం అని సమాధానం ఇచ్చారు. బిల్లు అయిన వెంటనే పూడ్చి వేస్తాం అన్నారు. నిధులు దుర్వినియోగం చేశారు. అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. –సత్యమయ్య, రైతు, వసంతాపురం
ఉపయోగం లేదు
వనం రస్తాలో ఎనిమిది చెక్‌డ్యాంలు నిర్మించారు. అక్కడ వర్షపు నీరు ప్రవహించే అవకాశం లేదు. ఈ పనులు రైతులు ఉపయోగపడవు. దాదాపు రూ.15 లక్షలతో డ్యాంలు నిర్మించారు. నిధులు వృథా అయ్యాయి. –ఎంసీ సుధాకర్, ఆకుమల్ల గ్రామం
సంజామల: పారుతున్న నీటిని నిలిపి రైతులకు ఉపయోగపడే విధంగా చేయడమే వాటర్‌షెడ్ ప్రధాన లక్ష్యం. అయితే అందుకు విరుద్ధంగా వాటర్‌షెడ్ పనులు చేస్తున్నారు. అన్నదాతల అనుమతి కూడా తీసుకోవడం లేదు. నాశిరకం పనులు చేస్తూ కొందరు బిల్లులు చేసుకుంటూ ప్రభుత్వ ధనాన్ని వృథా చేస్తున్నారు. నీటి ప్రవాహం లేకున్నా అక్కడ గ్యాబియన్‌లు, రాతి షేక్‌డ్యాంలు, డబ్యూహెచ్‌ఎస్, ర్యాక్ ఫిల్ డ్యాంలు, కుంటలు నిర్మించారు. సంజామల మండల పరిధిలోని ఆకుమల్ల గ్రామంలో వాటర్‌షెడ్ కింద రూ.1.38 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు రూ.38 లక్షలు విలువ చేసే పనులు పూర్తి చేశారు. వీటిలో ఉపయోగపడే పనులు లేవని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సభ తీర్మానం చేసి.. ప్రజలకు తేలియజేసి.. రైతులకు ఉయోగకరమైన పనులు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆకుమల్ల మైక్రోషెడ్ ప్రాజెక్ట్ పనులు ఇందుకు విరుద్ధంగా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వనం రస్తాలో జరిగిన పనులు ప్రతిపాదనలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. రస్తాలో ఎనిమిది చెక్‌డ్యాంలు, రెండు గ్యాబియన్‌లు నిర్మించారని, వీటి కోసం రూ.20 లక్షలు వృథా చేశారని ఆరోపిస్తున్నారు.
వాటర్‌షెడ్ పేరుతో నిధులు స్వాహా!
ఉన్నతాధికారులు విచారణ జరపాలని
రైతుల డిమాండ్
అను‘మతి లేని’ పనులు!
Comments
Please login to add a commentAdd a comment