ఆయిల్ ఫామ్ రైతులకు డ్రిప్ సౌకర్యం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: జిల్లాలో 400 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగు చేసుకుంటున్న రైతులను ప్రోత్సహిస్తూ డ్రిప్ సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించే ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. తుమ్మల, పతంజలి, నవభారత్ తదితర కంపెనీలు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయడంతో పాటు బిందు సేద్యం పరికరాల ఏర్పాటుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసు కోవాలన్నారు. ఆయిల్ ఫామ్ విత్తనాల నర్సరీలను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలో 7 వేల హెక్టార్లలో డ్రిప్పు పరికరాల లక్ష్యానికి గాను 4వేల హెక్టార్లు రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, మిగిలిన 3వేల హెక్టార్ల లక్ష్యాన్ని మార్చి నెలాఖరులోగా సాధించాలన్నారు. అనంతరం 2025 ఉద్యాన శాఖ డైరీని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్య క్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, ఏపీఎంఐపీ పీడీ సత్యనారాయణ, హార్టికల్చర్ అధికారులు, తుమ్మల, పతాంజలి, నవభారత్, తదితర కంపెనీల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.
శ్రీశైలంలో 19 నుంచి
ఆర్జిత సేవల నిలుపుదల
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు శ్రీశైల క్షేత్రంలోని ఉభ య దేవాలయాల్లో ఆర్జిత సేవలను నిలుపుదల చేసినట్లు దేవస్థాన అధికారులు పేర్కొన్నారు. భక్తులందరికీ దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివమాలధారణ చేసిన భక్తులకు జ్యోతిర్ముడి కలిగి ఉంటే ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు నిర్దిష్ట వేళల్లో మాత్రమే స్వామివారి స్పర్శదర్శనం కల్పిస్తారు.
నలుగురికి షోకాజ్ నోటీసులు
బండి ఆత్మకూరు: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులు అనారోగ్యానికి గురైన ఘటనలో పలువురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై గురువారం జిల్లా సమగ్ర శిక్ష అదనపు కో ఆర్డినేటర్ ప్రేమంత్ కుమార్, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి లలితకుమారి విచారణ జరిపారు. అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసిన చికెన్‌ను విద్యార్థినులు తినడం వల్లే ఫుడ్‌పాయిజన్ అయ్యిందని విచారణలో తేలడంతో విధుల్లో అలసత్వం వహించిన నలుగురు వంట మనుషులకు, అకౌంటెంటెంటుకు, పీఈటీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థినులు తీసుకున్న ఆహారాన్ని, నీటి నమూనాల ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా నాణ్యత లేని చికెన్‌ను సరఫరా చేసిన టెండర్ దారుల పట్ల అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆయిల్ ఫామ్ రైతులకు డ్రిప్ సౌకర్యం
ఆయిల్ ఫామ్ రైతులకు డ్రిప్ సౌకర్యం
Comments
Please login to add a commentAdd a comment