కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు నగరంలో బర్డ్‌ఫ్లూ సోకి బాతులు మృతిచెందిన నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమయ్యింది. నగరంలోని ఎన్‌ఆర్‌పేటను జిల్లా యంత్రాంగం రెడ్ అలర్ట్ జోన్‌గా ప్రకటించారు. స్థానిక బెస్త రాజుకు చెందిన 15 బాతులు మృతి చెందడం, అందుకు బర్డ్‌ఫ్లూ కారణమని ల్యాబ్ నుంచి నివేదిక రావడంతో చుట్టూ కిలోమీటర్ మేర రెడ్ అలర్ట్ జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతంలో చికెన్, గుడ్లు అమ్మకాలు చేపట్టకుండా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆరుగురు పశుసంవర్థక శాఖ అధికారులతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. కోళ్లు, బాతులు, ఇతర పక్షులు అకస్మాత్తుగా మరణిస్తుంటే వెంటనే తగిన సమాచారం ఇవ్వాలని పశుసంవర్థక శాఖ అధికారులు కోళ్లు, బర్డ్స్ పెంపకందారులకు సూచించారు.
అప్రమత్తంగా ఉండండి
కర్నూలు (హాస్పిటల్): కోళ్లకు వ్యాపిస్తున్న బర్డ్‌ఫ్లూ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. గురువారం ఆయన రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రెండు మూడు జిల్లాల్లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ వ్యాధి వ్యాపించిందన్నారు. ఇతర జిల్లాల్లోనూ ఈ వ్యాధి వ్యాపిస్తే అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, చనిపోయిన కోళ్లను సక్రమంగా పూడ్చిపెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలిచ్చారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి.శాంతికళ, ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు ఎన్‌ఆర్‌పేటను
రెడ్ అలర్ట్ జోన్‌గా ప్రకటన
ఈ ప్రాంతంలో చికెన్, గుడ్ల
అమ్మకాలు నిషేధం
Comments
Please login to add a commentAdd a comment