టీడీపీ నేతల కబ్జాలపై జేసీకి ఫిర్యాదు
చాగలమర్రి: మండలంలోని డి.కొత్తపల్లె గ్రామంలో వంక స్థలాన్ని గ్రామానికి చెందిన టీడీపీ నేతలు కబ్జా చేశారని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌కు సర్పంచ్ బాలీశ్వరరెడ్డి గురువారం ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన జేసీ వెంటనే ఆ సమస్యకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు పంపాలని.. వెంటనే సమస్య పరిష్కారం చేయాలని తహసీల్దారును ఆదేశించారు. పెద్ద బోధనం గ్రామ రెవెన్యూలోని 575/1 సర్వే నంబరులో ఉన్న 6.70 ఏకరాల విస్తీర్ణం గల వంక పోరంబోకు స్థలం, 575/4 సర్వే నంబరులో పట్టా భూమిని 0.35 స్థలాన్ని అక్రమించి ఒక వ్యక్తి పెట్రోల్ బంకు నిర్మాణం చేశాడని బాధిత రైతు మోర్‌గుడి సాగర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. సర్వే నిర్వహించి నిర్మాణాలను తొలగించాలని జేసీ ఆదేశించారు. సర్వే నిర్వహించి తమ భూమికి సంబంధించి విస్తీర్ణాన్ని ఆన్‌లైన్ చేయాలని చాగలమర్రికి చెందిన రైతు అబ్దుల్లా కోరారు.
పకడ్బందీగా భూ సర్వే
జిల్లాలో ప్రతి మండలం నుంచి ఒక గ్రామాన్ని తీసుకొని భూ నీసర్వే నిర్వహిస్తున్నామని జేసీ విష్ణు చరణ్ తెలిపారు. నెలంపాడు గ్రామంలో భూ రీసర్వే కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. రీసర్వే సమయంలో చుట్టు పక్కన భూములు ఉండే యజమానులను పిలించాలని సిబ్బందిని ఆదేశించారు. జేసీ వెంట నంద్యాల ఆర్డీఓ చల్లా విశ్వనాథ్, తహసీల్దార్ రవికుమార్, డీటీ విజయ్ కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment