భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు
ఆదోని రూరల్/పెద్దకడబూరు: భార్యను హత్య చేసిన కేసులో భర్తకు ఆదోని కోర్టు జీవిత ఖైదు(యావజ్జీవ కారాగార శిక్ష) విధించినట్లు కోర్టు మానిటరింగ్ ఏఎస్‌ఐ నరసింహులు తెలిపారు. కేసుకు సంబంధించి పెద్దకడబూరు పోలీసులు తెలిపిన వివరాలు.. పెద్దకడబూరు మండలం గంగులపాడు గ్రామానికి చెందిన కురువ నాగేష్‌కు కోసిగి మండలం సజ్జలగుడ్డం గ్రామానికి చెందిన జయలక్ష్మితో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 20న అర్ధరాత్రి భార్యతో గొడవ పడి తాగిన మైకంలో గొడ్డలితో నరికి హత్య చేశాడు. మృతురాలి తండ్రి యల్లప్ప ఫిర్యాదు మేరకు అప్పటి ఏఎస్‌ఐ శివరాములు కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ ప్రసాద్ కేసును దర్యాప్తు చేసి సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించారు. విచారణ అనంతరం నిందితుడు నగేష్‌పై నేరం రుజువు కావడంతో ఆదోని రెండో అదనపు జిల్లా జడ్జి పీజే సుధ జీవిత ఖైదుతో పాటు రూ.1,500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అనంతరం ఖైదీని పోలీసులు సబ్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment