బాధితుడికి సెల్‌ఫోన్ అప్పగింత
కర్నూలు (టౌన్): రోడ్డు మీద దొరికిన సెల్‌ఫోన్‌ను పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు నగరంలోని పెద్దపడఖానకు చెందిన మక్బూల్. గురువారం మక్బూల్ మసీదులో సమాజ్ చేసుకుని తిరిగి ఇంటికి వచ్చే సమయంలో రోడ్డు మీద మొబైల్ ఫోన్ దొరికింది. నేరుగా డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని డీఎస్పీ బాబు ప్రసాద్‌కు అప్పగించాడు. అప్పటికే ఎర్రబురుజుకు చెందిన మహేశ్వర్ ఆచారి ఓల్డ్ ఆంధ్రాబ్యాంకు వద్ద తన పిల్లలతో బయటకు వెళ్లిన సమయంలో తన సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితుని డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి సెల్ ఫోన్‌ను అప్పగించారు. నిజాయితీ చాటుకున్న మక్బూల్‌ను డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment