ఎమ్మిగనూరు రూరల్: మండల పరిఽధిలోని బనవాసి గ్రామంలో గురువారం విద్యుత్ లైన్ మరమ్మతుల పనుల్లో ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతనికి గురై జార్ఖండ్‌కు చెందిన సందీప్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కాంట్రాక్టర్ జార్ఖండ్ నుంచి కూలీలను రప్పించి కొన్ని రోజులుగా గ్రామంలో విద్యుత్ పునరుద్ధరణ పనులు చేయిస్తున్నారు. ఈక్రమంలో ఉదయం పనులు జరిగేటప్పుడు రెండు లైన్లలో విద్యుత్ సరఫరా అవుతుండటంతో విద్యుత్ అధికారులు ఒక లైన్ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మరో లైన్ విద్యుత్ సరఫరా నిలిపివేసిన తరువాత పనులు మొదలు పెట్టాలని కాంట్రాక్టర్ కూలీలకు చెపుతుండగా సందీప్ అనే కూలీ నేను స్తంభం పైకి ఎక్కేలోపు లైన్ విద్యుత్ సరఫరా నిలిపివేస్తారులే అంటు ఎక్కాడు. వైర్లు పట్టుకోవటంతో విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. వెంటనే తోటి కూలీలు సందీప్‌ను ఆటోలో బనవాసిఫారం వరకు తీసుకురాగా అక్కడ నుంచి 108 అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
నేడు మద్దిలేటయ్య క్షేత్రంలో వేలం పాటలు
బేతంచెర్ల: మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఉప కమిషనర్ రామాంజనేయులు గురువారం తెలిపారు. ఆలయ ఆవరణలో దుకాణాల ఏర్పాటుకు, వంట చెరకు విక్రయానికి, గోశాలకు గడ్డి సరఫరాకు, స్వామి వారి చిత్ర పటాలు ఏడాది పాటు విక్రయించుకోవడానికి బహిరంగ వేలం పాటలు నిర్వహించనున్నామని ఆసక్తి ఉన్న వారు దేవదాయ శాఖ నిబంధనల మేరకు ధరవాత్తు చెల్లించి వేలం పాటల్లో పాల్గొనాలన్నారు.
రేపు జాబ్ మేళా
నంద్యాల(న్యూటౌన్): ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నంద్యాలలో ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 14న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ గురువారం తెలిపారు. జాబ్‌మేళాలలో 5 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. టెన్త్, ఐటీఐ, డిప్లమా, ఇంటర్, డిగ్రీ, బీటె క్, పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఇంటర్వ్యూలకు అభ్యర్థులు విద్యార్హత పత్రాలు, రెండు ఫొటోలతో హాజరు కావాలన్నారు. వివరాలకు 9440224291, 9182217075ను సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment