ఇళ్ల మధ్య మద్యం దుకాణం వద్దు
● అడ్డుకున్న జూపాడుబంగ్లా ప్రజలు
జూపాడుబంగ్లా: నివాసగృహాల మధ్యన మద్యం దుకాణాలు వద్దని, ఊరికి దూరంగా ఏర్పాటు చేయించాలని జూపాడుబంగ్లాలో గురువారం ప్రజలు అడ్డుకున్నారు. నూతన దుకాణ ప్రారంభాన్ని అడ్డుకుని కర్నూలు–గుంటూరు (కేజీ) రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ.. కేజీ రోడ్డు పక్కన బైరెడ్డినగర్ కాలనీలోని నివాస గృహాల మధ్యన మద్యం దుకాణం ఏర్పాటు చేయటం ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. పాత మద్యం దుకాణం కాసానగర్‌కాలనీకి వెళ్లేదారి పక్కనే ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎకై ్సజ్‌శాఖ, పోలీసులు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకొని గ్రామానికి దూరంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించాలన్నారు. కేజీ రోడ్డుపై ప్రజలు చేపట్టిన ఆందోళనతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. విషయం తెలుసుకున్న బ్రాహ్మణకొట్కూరు ఎస్‌ఐ తిరుపాలు అక్కడికి చేరుకొని తహసీల్దార్‌తో మాట్లాడారు. గ్రామస్తులకు ఇబ్బందిలేకుండా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. రెండు మద్యం దుకాణాలను గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయించాలని ప్రజలు తహసీల్దార్ చంద్రశేఖర్‌నాయక్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన నివేదికలు సమర్పించాలని వీఆర్వోలను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment