మహిళపై దాడి కేసులో నలుగురికి ఐదేళ్లు జైలు
ఆళ్లగడ్డ: మహిళపై దాడి చేసిన నలుగురుకి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4 వేల చొప్పున జరిమానా విధిస్తూ ఆళ్లగడ్డ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. అశోక్ తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని కోరినందుకు మండల కేంద్రం చాగలమర్రికి చెందిన ముత్యాలపాడు మహబూబ్‌బీపై 2016 మే 16న చాగలమర్రి మండలం పెద్ద బోధనం గ్రామానికి చెందిన గడ్డ కిశోర్, గజ్జల బాలయ్య, లక్ష్మీదేవి, టంగుటూరి అశోక్ దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చాగలమర్రి పోలీసులు నిందులను అరెస్ట్ చేసి కోర్టులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితులకు ఐదేళ్ల జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించిందని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment