నంద్యాల(అర్బన్): 2024–25 సంవత్సరం జిల్లాలోని బీసీ, ఈబీసీ, కమ్మ,రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కార్పొరేషన్లకు సంబంధించిన లబ్ధిదారులు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం కార్యనిర్వాహక సంచాలకులు జాకీర్‌హుసేన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దుకాణాల ఏర్పాటుకు 21సంవత్సరాల నుంచి 60ఏళ్ల వయస్సు వారు అర్హులని, తెల్లరేషన్‌కార్డు, కులధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు కలిగి ఉండాలని చెప్పారు. బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ సర్టిఫికెట్లు కావాలని చెప్పారు. అర్హత ఉన్న వారు వెబ్‌సైట్ https://apobmms.apcfss.inలో నమోదు చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment