
నాణ్యత పాటించకపోతే చర్యలు
మహానంది: విద్యార్థినులకు వండే ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖా ధికారి జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు. తిమ్మాపురంలోని కేజీబీవీలో ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులు తీసుకునే రాగిజావ, అల్పాహారం పరిశీలించారు. వారితో పాటే కలిసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వంటగదితో పాటు వంట పాత్రలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యా శాఖ విడుదల చేసిన 100 రోజుల ప్రణాళికను తప్పకుండా పాటించాలన్నారు. పదవ తరగతి విద్యార్థుల స్టడీ అవర్‌ను పరిశీలించి ఉపాధ్యాయులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
మహానందీశ్వరుడి సన్నిధిలో ..
మహానంది: డీఆర్‌డీఓ శ్రీనిధి రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ హరిప్రసాద్ శుక్రవారం మహానందిలో పూజలు నిర్వహించారు. మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలం శ్రీనివాసులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజలు చేశారు. దర్శనం తర్వాత స్థానిక అలంకార మండపంలో వేదపండితులు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు చేశారు.
ముమ్మరంగా రైతుల రిజిస్ట్రేషన్
● నంద్యాల జిల్లాలో 35,598 నమోదు
కర్నూలు(అగ్రికల్చర్): కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైతులకు ఆధార్ తరహాలో 11 అంకెల తో కూడిన ప్రత్యేక నెంబరును కేటాయించే ప్రక్రియ ఊపందుకుంది. కర్నూలు, నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (ఏపీఎఫ్‌ఆర్)లో రైతులను రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. కర్నూలు జిల్లాలో 2,52,624 మంది రైతులు ఉండగా...రైతు సేవా కేంద్రాల ఇన్‌చార్జీలు 39,373 మందిని ఎన్‌రోల్‌మెంటు చేశారు. నంద్యాల జిల్లాలో 2,03,291 మంది రైతులు ఉండగా.. 35,598 మంది రైతులను నమోదు చేశారు. ఆధార్‌లో పేర్ల వివరాలు, ఆర్‌వోఆర్‌లోని వివరాలు 80 శాతం వరకు సరిపోతే రైతు సేవా కేంద్రం ఇన్‌చార్జి పరిధిలోనే 11 అంకెల యూనిక్ ఐడీ నెంబరు జారీ అవుతోంది. ఆధార్, ఆర్‌వోఆర్‌లోని వివరాలు 80 శాతం వరకు సరిపోకపోతే అటువంటి వాటిని వీఆర్‌వో లాగిన్‌కు అప్‌లోడ్ చేస్తారు. వీఆర్‌వోలు రెవెన్యూ రికార్డులు, ఆర్‌వోఆర్‌లోని వివరాలు పరిశీలిస్తారు. ఆర్‌వోఆర్ వివరాల్లో తేడాలు ఉంటే వెబ్‌ల్యాండ్‌లో సరిచేస్తారు. ఆ తర్వాతనే యూనిక్ ఐడీ వస్తుంది. కర్నూలు జిల్లాలో 29,441 మంది, నంద్యాల జిల్లాలో 25,237 మంది రైతుల ఆధార్ వివరాలతో ఆర్‌వోఆర్ వివరాల్లో తేడాలు ఉండటంతో వీఆర్‌వో లాగిన్‌కు పంపారు. రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రాల ఇన్‌చార్జీలను సంప్రదించి ఏపీఎఫ్‌ఆర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి సూచించారు.

నాణ్యత పాటించకపోతే చర్యలు
Comments
Please login to add a commentAdd a comment