
ఫుడ్ సెఫ్టీ అధికారుల దాడులు
బనగానపల్లె రూరల్: పట్టణంలోని మార్కెట్‌యార్డు ఆవరణలో తెల్లజొన్నలకు రసాయన మందులు కలిపి పచ్చజొన్నలుగా మార్పు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో జిల్లా ఫుడ్‌సెఫ్టీ అధికారులు షేక్ ఖాసీంవలి, వెంకటరాముడు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. మార్కెట్‌యార్డు ఆవరణలో ఉంచిన పచ్చజొన్నల నాణ్యతను పరిశీలించి, పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరించారు. రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని వెల్లడించారు. కల్తీ జరిగినట్లు భావించే జొన్నలు శ్రీ లక్ష్మీ వెంకటరాఘవేంద్ర ట్రెడర్స్‌కు చెందినవిగా గుర్తించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు ఇన్‌చార్జ్ కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.
రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలి
నంద్యాల(న్యూటౌన్): వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి సూచించారు. శుక్రవారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా నంద్యాల ద్విచక్ర వాహన డీలర్లు, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ప్రైవేటు లిమిటెడ్ చాపిరేవుల టోల్‌ప్లాజా (జాతీయ రహదారుల సంస్థ) ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హెల్మెంట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను ద్విచక్ర వాహన చోదకులకు వివరిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్రవాహనాలు నడుపుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు కార్యక్రమంలో నంద్యాల ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, టోల్‌ప్లాజా ప్రాజెక్టు మేనేజర్ మధన్‌మోహన్, రూట్ మేనేజర్ సర్వీస్‌రెడ్డి, పారామెడికల్స్, అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.

ఫుడ్ సెఫ్టీ అధికారుల దాడులు
Comments
Please login to add a commentAdd a comment