
వీర జవాన్లు..మీకు జోహార్లు
పుల్వామా దాడిలో అసువులు బాసిన భారత వీర జవాన్లకు శుక్రవారం ఆత్మకూరు మండలం బైర్లూటీగూడెం గిరిజన పాఠశాలలో విద్యార్థులు నివాళులర్పించారు. మహిళా పోలీసు మైమున్నీసాబేగం ఆధ్వర్యంలో అమరవీరుల చిత్రపటాలను ప్రదర్శించారు. ఆరేళ్ల క్రితం 2019 ఫిబ్రవరి 14వ తేదీన దేశ సరిహద్దులోని జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లాలో భారత సైనికుల వాహనంపై ఉగ్రదాడి జరగడంతో 40 మంది జవాన్లు మృతి చెందారని, ఇది చాలా బాధాకర సంఘటన అని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. వీరజవాన్లకు నివాళులర్పించిన వారిలో ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్ యాజమాన్య,ం సర్పంచ్ గురవమ్మ, ఆర్.శివశంకర్‌నాయక్ పాల్గొన్నారు.
–ఆత్మకూరు
Comments
Please login to add a commentAdd a comment