వెల్దుర్తి: సూక్ష్మ, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఉమాదేవి అన్నారు. శనివారం ఆమె మండల కేంద్రంలో పీఎమ్‌ఎఫ్‌ఎమ్‌ఈ స్కీం కింద ఏర్పాటు చేసుకున్న దాల్ మిల్, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మార్కెటింగ్ అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయం, పాడి, మత్స్య సంపదలకు అనుబంధంగా ఆహార ఉత్పత్తి పరిశ్రమల ఏర్పాటుతో అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. 18 నుంచి 55 ఏళ్లలోపు వారికి సబ్సిడీతోపాటు యూనిట్ కాస్ట్‌లో కేవ లం 10 శాతం పెట్టుబడితో బ్యాంకుల ద్వారా 90 శాతం రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు.
ఇంటింటి ఫీవర్ సర్వే
కర్నూలు(హాస్పిటల్): బాతులకు బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో కర్నూలు నగరంలోని ఎన్‌ఆర్ పేటలోని ఒక కిలోమీటర్ పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది శనివారం ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టింది. ఎన్‌ఆర్ పేటలోని 47, 47ఏ, 48 వార్డుల్లోని 89 గృహాల్లో 320 మందికి ఎనిమిది బృందాలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగప్రసాద్ బాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేలో జ్వర లక్షణాలు కలిగిన వారు లేరన్నారు.
Comments
Please login to add a commentAdd a comment