కర్నూలు (సిటీ): బస్సు డ్రైవర్లు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీటీసీ ఎస్.శాంతకుమారి, ఆర్‌టీఓ ఎల్ భరత్ చౌహాన్, ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్, ఎంవీఐ కె.రవీంద్ర కుమార్ సూచించారు. కర్నూలు 1,2 డిపో మేనేజర్ల ఆధ్వర్యంలో శనివారం కర్నూలు–2 డిపో గ్యారేజ్‌లో రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. అలాగే రోడ్డుపై ఉన్న సూచనల బోర్డులను గమనించి, ఇతర వాహనదారులకు ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ చేయాలన్నారు. అనంతరం కర్నూలు రీజియన్‌లో ప్రమాద రహిత డ్రైవర్లను ప్రోత్సాహక బహుమతులు అందజేసి సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment