
వెలుగోడు వీఆర్‌ఓ మృతి
బండ ఆత్మకూరు: మండల పరిధిలోని నారాయణాపురం గ్రామానికి చెందిన వెలుగోడు వీఆర్వో ఎండూరి.అనంతసే నా రెడ్డి (60 ) శనివారం సాయంత్రం మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన హైదరా బాద్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివా రం కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య సత్యాదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న శ్రీ శైలం మాజీ శాసన సభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను ఫోనులో పరామర్శించారు.
గూడ్స్ రైలు కింద పడి..
డోన్ టౌన్: పట్టణ సమీపంలోని కొత్తబుగ్గ వద్ద గూడ్స్ రైలు కింద పడి కోట్లవారిపల్లెకి చెందిన చిన్నన్న(85) అనే వృద్ధుడు మరణించాడు. గూడ్స్ రైలు గార్డు సమాచారంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు కోట్లవారి పల్లెకి చెందిన చిన్నన్నగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆత్మహత్యనా అనే కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వివాహిత బలవన్మరణం
బనగానపల్లె రూరల్: మండలం పరిధిలోని యనకండ్ల గ్రామానికి చెందిన టి. శివమ్మ(35)అనే వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు స్థానికులు తెలిపిన మేరకు.. యనకండ్ల గ్రామానికి చెందిన బాలుడు,శివమ్మ దంపతులు కూలీ పనులు చేసుకొని జీవిస్తున్నారు. అయితే, కుటుంబంలో నెలకొన్న సమస్యల కారణంగా ఇంట్లో ఎవరులేని సమయంలో ఆమె సిలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కుటుంబసభ్యుల ఫిర్యాదుతో బనగానపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

వెలుగోడు వీఆర్‌ఓ మృతి

వెలుగోడు వీఆర్‌ఓ మృతి
Comments
Please login to add a commentAdd a comment