
లెనోవా ల్యాప్‌ట్యాప్స్ షోరూం ప్రారంభం
కర్నూలు (టౌన్): నగరంలోని స్థానిక అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్‌లో శుక్రవారం సాయంత్రం లెనోవా అథరైజ్డ్ కంపెనీ ల్యాప్‌ట్యాప్స్ షోరూం ప్రారంభమైంది. మాజీ రాజ్య సభ సభ్యులు టీజీ వెంకటేష్ అతిథిగా హాజరై ఈ షోరూంను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో సాఫ్ట్‌వేర్ రంగం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్స్, డెస్క్‌టాప్స్, ట్యాబ్స్ ప్రాధాన్యత ఎంతో పెరిగిందన్నారు. జేఎం కంప్యూటర్స్ సంస్థ అధినేత షేక్ అబ్దుల్ నబీ, షేక్ షాకీర్ బాషా మాట్లాడుతూ కంప్యూటర్ రంగంలో 23 సంవత్సరాల అనుభవం ఉందని, తమ లెనోవా షోరూంలో లాప్‌ట్యాప్స్‌తో పాటు గేమింగ్ లాప్‌ట్యాప్స్, మానిటర్స్, ట్యాబ్స్ అన్ని రకాల నాణ్యమైన ఉత్పత్తులు ఆన్‌లైన్ ధరల కన్నా 5 శాతం తక్కువకు అందిస్తున్నట్లు చెప్పారు. షోరూంలో సర్వీస్ సెంటర్ ఉందని, మూడేళ్ల వారంటీ ఫ్రీ సర్వీసు ఇస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధులు పరదేశ్, కార్తీక్, జస్‌ప్రీత్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment