● ఏపీ, టీజీ, కర్ణాటక ఆర్టీసీ బస్సులకు
ప్రత్యేకంగా బస్టాండ్
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. భక్తులు వేలాది వాహనాల్లో బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు. వాహనాల పార్కింగ్ కోసం క్షేత్ర పరిధిలో మొత్తం 25 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. హెలిప్యాడ్, వాసవి విహార్ పక్కన, ఆగమ పాఠశాల ఎదురుగా, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, గణేశసదన్ ఎదురుగా, విభూతిమఠం పార్కింగ్ ఏరియా, ఫిల్టర్‌బెడ్, గణేశసదనం పక్కన, మల్లమ్మ కన్నీరు వద్ద, గురుసదన్ ఎదురుగా తదితర ప్రదేశాలలో మొత్తం 25 ఎకరాల్లో 5,050 వాహనాలు పార్కింగ్ చేసుకునే వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు ప్రాంగణాలను తీర్చిదిద్దారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు వెంట కూడా ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు నిలుపుకునే వెసలుబాటు కల్పించారు. మొత్తం 13.80 ఎకరాల్లో 4,640 ఆర్టీసీ బస్సులు నిలుపుకోవచ్చు. కార్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌బస్సులు నిలుపుకునే ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం కల్పించారు. అలాగే తాత్కాలిక టాయిలెట్స్, తాత్కాలిక వసతి పొందేందుకు షామియానాలు, స్నానమాచరించేందుకు అవసరమైన నీటి కొళాయిలు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు పార్కింగ్‌ల వద్ద సమాచార కేంద్రాలను, క్షేత్ర పరిధిలో ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాలో భక్తులకు తెలిసే విధంగా సూచికబోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment