కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖ భూసంరక్షణ విభాగానికి నిధులు విడుదల అయ్యాయి. ఉమ్మడి జిల్లాకు రూ.2.70 కోట్లు మంజూరు కాగా.. ప్రస్తుతం రూ.1.34 కోట్లు విడుదల అయ్యాయి. కర్నూలు జిల్లాకు రూ.1.50 కోట్లు మంజూరు కాగా.. మొదటి విడత కింద రూ.74.53 లక్షలు మంజూరు అయ్యాయి. నంద్యాల జిల్లాకు రూ.1.20 కోట్లు మంజూరు కాగా మొదటి విడతలో రూ.59.60 లక్షలు విడుదల అయ్యాయి. ఈ నిధుల్లో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరిస్తాయి. ఆర్‌కేవీవై కింద వర్షాధార ప్రాంతం (ఆర్‌ఏడీ) అభివృద్ధికి ఈ నిధులు వినియోగిస్తున్నట్లుగా భూసంరక్షణ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. వ్యవసాయంలో రైతుల సామర్‌ాధ్యలను పెంచడం, భూమి అభివృద్ది తదితర వాటికి ఈ నిధులు వినియోగించడం జరుగుతుందన్నారు. కర్నూలు డివిజన్ కల్లూరు మండలం బొల్లవరం, కే.మార్కాపురం గ్రామాలు, ఆదోని డివిజన్‌లో బైచిగేరి, బసలదొడ్డి గ్రామాలు, నంద్యాల జిల్లా డోన్ మండలం యు.కొత్తపల్లి, ఎర్రగుంట్ల గ్రామాల్లో ఆర్‌ఏడీ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఒక రైతుకు ఆర్‌కేవీవై కింద రూ.30 వేల విలువ ఇన్‌పుట్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో రైతుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment