ఎక్కడైనా అభివృద్ధి పనులు చేపట్టాలంటే టెండర్లు పిలిచి ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి పనులు అప్పగిస్తారు. అయితే అహోబిలంలో అందుకు విరుద్ధంగా ఎవరు ఎక్కువగా ‘బి’ ట్యాక్స్ కట్టి వస్తే వారికి వారు అడిగినంత ధరకు పనులు అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముగ్గురు ఆలయ ఉన్నతాధికారులు స్థానిక టీడీపీ నేతలను పక్కన పెట్టి పనులు చేసేందుకు వచ్చే కాంట్రాక్టర్లను నేరుగా నియోజకవర్గ అధికారపార్టీ నేత దగ్గరకు తీసుకు పోయి అక్కడ పనులను బట్టి 30 నుంచి 50 శాతం కమీషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటున్నట్లు ఆ పార్టీ శ్రేణులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ ‘బి’ ట్యాక్స్‌లో ఆలయ అధికారులకు వస్తున్న వాటో ఎంతో తెలియడం లేదని చెబుతున్నారు. కాగా మరి కొందరు తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు గుడి ఆదాయం మొత్తం అధికార పార్టీ నేతకు దోచిపెట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment