
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు రబీ సాగు 2,45,466 హె
అవసరమైన యూరియా 1,47,279 టన్నులు
● అధికారపార్టీ నేతల చేతుల్లో
యూరియా
● అనుకూలమైన వారికి,
టీడీపీ కార్యకర్తలకే పంపిణీ
● వైఎస్సార్‌సీపీ ముద్రతో
సామాన్య రైతులకు మొండిచేయి
● నంద్యాల జిల్లాలో 14 టన్నుల
యూరియా కేవలం 15 మందికే పంపిణీ
● ప్రశ్నించే వారిపై కేసులతో వేధింపులు
● యూరియా సరఫరాలో
కూటమి ప్రభుత్వం విఫలం
ప్రభుత్వ సరఫరా చేసింది 61,985 టన్నులు మాత్రమే
ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతు పేరు చిన్న పుల్లయ్య. బండిఆత్మకూరు మండలం చిన్నదేవళాపురం. ఇతను 16 ఎకరాల్లో వరిసాగు చేశాడు. ఈనెల 14వ తేదీన రైతు భరోసా కేంద్రం వద్ద యూరియా కోసం వెళ్లి క్యూలో నిలబడ్డాడు. టీడీపీకి చెందిన కొందరు నేరుగా వెళ్లి ఎరువులు తీసుకుంటుండడంతో ఇదేమి న్యాయమని ప్రశ్నించగా దాడి చేశారు. తరువాత వారే పోలీసులకు ఫిర్యాదు చేసి పుల్లయ్యపై కేసు పెట్టించారు. అరెస్టు చేసేందుకు పోలీసులు ఏకంగా గ్రామానికి వెళ్లారు. పొలంలో ఉన్న పుల్లయ్యకు ఈ విషయం తెలిసి తీవ్ర ఆందోళనకు గురై పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
కర్నూలు(అగ్రికల్చర్)/బండిఆత్మకూరు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో రబీ సాధారణ సాగు 2,82,247 హెక్టార్లు కాగా ఇందులో కర్నూలు జిల్లాలో 1,10,386, నంద్యాల జిల్లాలో 1,71,861 హెక్టార్లు. ఇప్పటి వరకు ఈ రెండు జిల్లాలో 2,45,466 హెక్టార్లు సాగైంది. కేసీ కెనాల్, తెలుగు గంగ కాల్వలకు నీరు సమృద్ధిగా వస్తుండటంతో నంద్యాల జిల్లాలో 1,61187 హెక్టార్లలో పంటలు వేశారు. ఇందులో వరి సాధారణ సాగు 27,908 హెక్టార్లు ఉండగా.. ఇప్పటికే 34,940 హెక్టార్లలో సాగు అయింది. అంటే 7 వేల హెక్టార్లకుపైగా అదనంగా సాగు అయింది. మరో ఆరేడు వేల హెక్టార్లలో సాగు అయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ సాగు విస్తీర్ణాన్ని అంచనా వేయడంలో వ్యవసాయ యంత్రాంగం విఫలమైంది. దీనికితోడు డిమాండ్‌కు అనుగుణంగా యూరియా సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది.
అంతంత మాత్రంగానే
యూరియా సరఫరా
నంద్యాల జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 63,911 టన్నుల యూరియా వచ్చింది. అయితే, 53,417 టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయి. రబీ సీజన్‌కు సంబంధించి యూరియా ఓపెనింగ్ బ్యాలెన్స్ 10 వేల టన్నులు ఉంది. ప్రస్తుతం నంద్యాల జిల్లాకు 37,483 టన్నులు మాత్రమే వచ్చింది. ఓపెనింగ్ బ్యాలెన్స్‌తో కలిపితే రబీ సీజన్‌కు మొత్తం 47 వేల టన్నుల యూనియా వచ్చినట్లు అవుతోంది. అయితే, నీటిపారుదల సదుపాయం ఉండటంతో ఇక్కడ సాధారణం కంటే 15 వేల హెక్టార్ల వరకు ఎక్కువగా పంట సాగు అవుతోంది. దీనిని అధికారులు అంచనా వేయకపోవడంతో బండిఆత్మకూరు, వెలుగోడు, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, శిరువెళ్ల, కోవెలకుంట్ల, అవుకు మండలాల్లో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది.
హైజాక్ చేస్తున్న అధికార పార్టీ నేతలు
యూరియా కొరతను టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాకు వచ్చే యూరియాలో 50 శాతం మార్క్‌ఫెడ్‌కు, మిగిలిన 50 శాతం ప్రైవేటు డీలర్లకు ఇస్తున్నారు. మార్క్‌ఫెడ్ నుంచి రైతుసేవా కేంద్రాలు, పీఏసీఎస్‌లకు వెలుతున్న యూరియా మొత్తాన్ని టీడీపీ నేతలే హైజాక్ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 45 కిలోల బస్తా ధర రూ.267 ఉండగా.. టీడీపీ నేతలు తమ కంట్రోల్‌లో ఉంచుకొని రూ.400 వరకు అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితి ప్రధానంగా బండిఆత్మకూరు, వెలుగోడు, మహానంది, ఆత్మకూరు మండలాల్లో ఎక్కువగా ఉంది. డిమాండ్ ఉన్నప్పుడు మార్క్‌ఫెడ్ ప్రైవేటు డీలర్లకు యూరియా ఇవ్వరాదు. అయితే రాజకీయంగా ఒత్తిడి చేసి మార్క్‌ఫెడ్ నుంచి ప్రైవేట్ డీలర్లకు కూడా యూరియా ఇస్తున్నారు. తర్వాత ఆ ఎరువు కూడా టీడీపీ నేతల పరం అవుతోంది.
కర్నూలు జిల్లాకు అరకొరనే...
జిల్లాలో నీటిపారుదల సదుపాయం అంతంతమాత్రంగా ఉండటంతో లేట్ రబీ సీజన్ కింద వరి సాగు తక్కువగా ఉంది. హాలహర్వి, కౌతాళం, హొళగుంద, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పెద్దకడబూరు తదితర మండలాల్లో ఎల్లెల్సీ కింద వరి సాగు ఉంది. జిల్లాలో 84,279 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. 29,517 టన్నుల యూరియా అవసరం కాగా 24.502 వేల టన్నులు వచ్చింది. ప్రస్తుతం జిల్లాలోని ప్రైవేట్ డీలర్ల దగ్గర యూరియా లభించని పరిస్థితి. మార్క్‌ఫెడ్‌లో కూడా 500 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. ఆదోని, ఎమ్మిగనూరు, పెద్దకడబూరు, కౌతాళం, మంత్రాలయం ప్రాంతాల్లో బస్తా యూరియా ధర రూ.350 పైనే అమ్మకాలు సాగిస్తున్నారు. పీఏసీఎస్‌లు, రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో కొందరు రైతులు కర్ణాటకకు వెళ్లి తెచ్చుకుంటున్నట్లు సమాచారం.
అధికార పార్టీ బరితెగింపు
14టన్నుల యూరియా
15 మందికే...
నంద్యాల జిల్లాలోని ఒక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి నాలుగైదు రోజుల క్రితం 30 టన్నుల యూరియా ఇచ్చారు. ఇందులో 14 టన్నులు 15 మందికే పంపిణీ అయింది. ఈ యూరియా పొందిన వారికి భూములు కూడా పెద్దగా లేవు. ప్రస్తుతం సాగు చేస్తున్న దాఖలాలు కూడా లేవు. డిమాండ్‌కు తగ్గ సప్లై లేని సమయంలో 14 టన్నుల యూరియా 15 మంది టీడీపీ నేతల వశం కావడం పలు విమర్శలు తావు ఇస్తోంది. ఇదిలా ఉంటే నంద్యాల జిల్లాలో ఒకే ఒక్క ర్యాక్ పాయింట్ ఉండగా అక్కడ టీడీపీ నేతలే ఉంటున్నారు. దీనిని బట్టి ర్యాక్ పాయింట్ మొదలు గ్రామస్థాయి వరకు పచ్చపార్టీ నేతలదే పెత్తనం సాగుతుందని చెప్పవచ్చు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు రబీ సాగు 2,45,466 హె

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు రబీ సాగు 2,45,466 హె
Comments
Please login to add a commentAdd a comment