అవుకు: దాడి కేసులో ముగ్గురు నిందితులను బనగానపల్లె పోలీసులు అరెస్టు చేశారు.బాధితులు, పోలీసులు తెలిపిన ప్రకారం .. కల్లూరు మండలం దూపాడుకు చెందిన కీర్తన(30) భర్త మల్లికార్జున, తండ్రి నాగరాజు ఈ నెల 8వ తేదీన అవుకు మండలం రామాపురం గ్రామంలో సమీప బంధువు హనుమంతరావు మృతి చెందడంతో చూడటానికి వచ్చారు. అంతకుముందే దూపాడు గ్రామానికి చెందిన కేశవరావు, రామక్రిష్ణ, రామరాజు అనే వ్యక్తులకు వీరికి గొడవలు ఉండేవి. దీనిని మనసులో పెట్టుకొని కీర్తన, మల్లికార్జున, నాగరాజులపై రామాపురంలో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కీర్తనను అవుకు ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక ఈ నెల 16వ తేదీన మృతి చెందింది. మృతురాలి భర్త మల్లికార్జున ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment