కారు ఢీకొని మహిళ దుర్మరణం
ఓర్వకల్లు: మండలంలోని చెన్నంశెట్టిపల్లె మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లెకు చెందిన షేక్ చిన్న ఉసేన్‌సాహెబ్ కుమారుడు షేక్షావలి, అతని భార్య షేక్ మహబూబ్‌బీ(45) అనే భార్యాభర్తలు ఇద్దరు మంగళవారం ఉదయం సొంత పనిమీద బైక్‌పై ఓర్వకల్లు వెళ్లారు. పని ముగించుకొని సాయంత్రం స్వగ్రామానికి తిరిగి వెళుతుండగా మార్గంమధ్యలో చెన్నంశెట్టిపల్లె క్రాస్ రోడ్డు వద్ద బేతంచెర్ల నుంచి నంద్యాల వైపునకు వెళుతున్న తెలంగాణాకు చెందిన కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహబూబ్‌బీ బైక్‌పై నుంచి కింద పడడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదతీరును పరిశీలించారు. మృతురాలి భర్త షేక్షావలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సునీల్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment