కోవెలకుంట్ల: పట్టణంలోని గుంజలపాడు రహదారిలో సుంకులమ్మ గుడి సమీపంలోని కొత్త కాలనీలో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. కోవెలకుంట్ల ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. సంజామల మండలం నట్లకొత్తూరుకు చెందిన ఉప్పలూరు వెంకటసుబ్బారెడ్డి (41) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాలనీలో రోడ్డు వేసేందుకు పట్టణ శివారులోని కుందూనది ఒడ్డున ఉన్న బెలుకురాళ్లను ట్రాక్టర్ ద్వారా తరలిస్తున్నాడు. రాళ్లట్రాలీని అన్‌లోడ్ చేసే క్రమంలో కిందకు దిగి ట్రాలీ డోర్ తీస్తుండగా ట్రాక్టర్ లోతట్టు ప్రాంతంలో ఉండటంతో వెనక్కు కదిలింది. ట్రాక్టర్‌ను ఆపేందుకు వచ్చే క్రమంలో ప్రమాదశాత్తు ట్రాక్టర్ టైరు కింద పడటంతో తల నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడికి భార్య శారద, కుమారుడు సోమేశ్వరరెడ్డి ఉన్నారు. ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment