రాజ కుటుంబీకుడు మృతి
అవుకు: అవుకును పాలించిన రాజుల కుటుంబానికి చెందిన నంద్యాల త్రివిక్రమ వర్మ (64) గుండెపోటుతో మృతి చెందాడు. ఈయన సోమవారం రాత్రి ఇంట్లో ఉండగా హఠాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అవుకు సీహెచ్‌సీకి తరలించగా డాక్టర్లు పరిశీలించి గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. రాజకుటుంబీకుడు మరణ వార్త తెలియగానే అవుకు ఎంపీపీ చల్లా రాజశేఖర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకుడు చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి, చల్లా విజయభాస్కర్ రెడ్డి, చల్లా రఘునాథ్ రెడ్డి, పోతిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment