కర్నూలు(సెంట్రల్): ఈనెల 23వ తేదీన జరిగే గ్రూపు–2 మెయిన్స్ పరీక్షకు జిల్లాలో 30 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 9,993 మంది పరీక్ష రాయనున్నారు. జేసీ బి.నవ్యను కో ఆర్డినేట్ అధికారిగా ఏపీపీఎస్‌సీ నియమించింది.
అభ్యర్థులకు సూచనలు ఇవీ..
● పరీక్ష రాసే వారు 15 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలి. ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.
● తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి.
● ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 3 నుంచి 5.30గంటల వరకు పేపర్–2 పరీక్ష నిర్వహిస్తారు.
● హాల్ టికెట్‌పై అభ్యర్థి ఫొటో సరిగ్గా కనిపించకపోయినా, చిన్నదైనా, అస్పష్టంగా ఉన్నా దానిపై గెజిటెడ్ అధికారితో సంతకం చేయించాలి. మూడు పాస్ ఫొటోలు తీసుకెళ్లాలి.
● పరీక్ష కేంద్రంలోకి టాబ్లెట్లు, ఐప్యాడ్లు, రైటింగ్ ప్యాడ్లు, హ్యాండ్ బ్యాగులు, ఏదైనా పేపర్లు , పుస్తకాలు, మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్, డిజిటల్ వాచ్‌లు, క్యాలికులేటర్లను అనుమతించరు. అనలాగ్ మణికట్టు గడియారాలను కూడా అనుమతించరు. ● బ్లాక్, బ్లూ బాల్ పెన్నులను వాడాలి. పెన్సిల్‌ను ఉపయోగించరాదు. ● అంధత్వం, రెండు చేతులు లేని వారు, సెరిబ్రల్ పాల్సీ విభాగంలో బెంచ్ మార్కు వైకల్యం ఉన్న వారు కోరుకుంటే లేఖరి/రీడర్/ల్యాబ్ సహాయకులను నియమించుకోవచ్చు.
● గ్రూపు–2 మెయిన్స్ పరీక్షకు వచ్చే అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడం కోసం కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్కును ఏర్పాటు చేశారు. ఇది ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరక అందుబాటులో ఉంటుంది. సందేహాలకు 08518–277305కు ఫోన్ చేయవచ్చని జేసీ డాక్టర్ బి.నవ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment