నంద్యాల(న్యూటౌన్): ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు మంగళవారం 39 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ సునీత తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షకు 976 మందికి గాను 960 మంది హాజరు కాగా 16 మంది గైర్హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం జరిగిన ప్రాక్టికల్ పరీక్షకు 915 మందికి గాను 892 మంది హాజరు కాగా 23 మంది గైర్హాజరైనట్లు ఆమె తెలిపారు. అన్ని కేంద్రాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయన్నారు.
గడ్డివాములు దగ్ధం
కర్నూలు: మండలపరిధిలోని పంచలింగాల గ్రామంలో ఐదు గడ్డివాములు కాలిబూడిదయ్యాయి. గ్రామ శివారులో మహిమాకర్, బాబు, దావీదు, సంజన్న, గాయన్న తదితరులకు చెందిన కల్లందొడ్లు పక్కపక్కనే ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం గడ్డివాములో నుంచి పొగ రాసుకుని పెద్దగా మంటలు చెలరేగడంతో గ్రామస్తులు అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకునేసరికి గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది నీళ్లు చల్లి మంటలను పక్క కల్లందొడ్లకు వ్యాపించకుండా అదుపు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment