ఇలకై లాసంలో బ్రహ్మోత్సవాలకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

ఇలకై లాసంలో బ్రహ్మోత్సవాలకు వేళాయె

Published Wed, Feb 19 2025 2:00 AM | Last Updated on Wed, Feb 19 2025 1:58 AM

ఇలకై

ఇలకై లాసంలో బ్రహ్మోత్సవాలకు వేళాయె

శ్రీశైలంటెంపుల్‌: ఇలకై లాసమైన శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. 11 రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగే ఈ వేడుకలకు బుధవారం అంకురార్పణ జరుగనుంది. ఉదయం యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవ క్రతువులు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునస్వామికి విశేష అర్చనలు, మహాశక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబాదేవికి ప్రత్యేక పూజలు, స్వామి అమ్మవార్లకు వివిధ వాహనసేవలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఉభయ దేవాలయాలను వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. అలాగే ప్రధాన ఆలయానికి ఎదురుగా, క్షేత్ర పరిధిలో ముఖ్యమైన కూడళ్లలో స్వామి అమ్మవార్ల చిత్రపటాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

ఉదయం 9 గంటలకు అంకురార్పణ

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాల క్రతువులు ప్రారంభమవుతాయి. వేద స్వస్తి, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవాచనం, చండీశ్వరపూజ, కంకణపూజ, దీక్షాకంకణ ధారణ, అఖండ దీపారాధన, వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధన, రుద్రకలశ స్థాపన, పంచావరణార్చనలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు జరుపుతారు. అలాగే సాయంత్రం 5.30 గంటలకు సాయంకాలార్చనలు, అగ్ని ప్రతిష్టాపన, అంకురార్పణ నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు భేరిపూజ, భేరీతాడనం, సకలదేవతాహ్వనపూర్వక ధ్వజారోహణ, ధ్వజపట అవిష్కరణ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు.

పట్టువస్త్రాలు సమర్పించనున్న

శ్రీకాళహస్తి దేవస్థానం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం శ్రీకాళహస్తిశ్వరస్వామి దేవస్థానం భ్రమరాంబామల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనుంది. సంప్రదాయాన్ని అనుసరించి ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామిఅమ్మవార్లకు సమర్పిస్తారు.

నేటి నుంచి 11 రోజులు

శ్రీశైల మల్లన్నకు విశేష వాహనసేవలు,

గ్రామోత్సవం

26న పాగాలంకరణ, కల్యాణోత్సవం

మొదటి రోజు శ్రీకాళహస్తి దేవస్థానం

వారిచే పట్టువస్త్రాల సమర్పణ

No comments yet. Be the first to comment!
Add a comment
ఇలకై లాసంలో బ్రహ్మోత్సవాలకు వేళాయె1
1/1

ఇలకై లాసంలో బ్రహ్మోత్సవాలకు వేళాయె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement