ఉన్నట్లుండి జ్వరం వస్తుంది. క్రమంగా తల నుంచి పాదాల వరకు నరాలు చచ్చుబడిపోయి కాళ్లూ, చేతులు పడిపోతాయి. కొందరికి ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. దీనినే గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌ (జీబీ సిండ్రోమ్‌) వ్యాధి అంటారు. ఈ వ్యాధి ప్రస్తుతం జిల్లా వాసులను కలవర పెడు | - | Sakshi
Sakshi News home page

ఉన్నట్లుండి జ్వరం వస్తుంది. క్రమంగా తల నుంచి పాదాల వరకు నరాలు చచ్చుబడిపోయి కాళ్లూ, చేతులు పడిపోతాయి. కొందరికి ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. దీనినే గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌ (జీబీ సిండ్రోమ్‌) వ్యాధి అంటారు. ఈ వ్యాధి ప్రస్తుతం జిల్లా వాసులను కలవర పెడు

Published Wed, Feb 19 2025 2:02 AM | Last Updated on Wed, Feb 19 2025 1:58 AM

ఉన్నట

ఉన్నట్లుండి జ్వరం వస్తుంది. క్రమంగా తల నుంచి పాదాల వరకు

వ్యాధి లక్షణాలు

● కండరాలు బలహీనంగా మారతాయి.

● కాళ్ల నుంచి మెదడు వైపునకు జలదరించినట్లు అనిపిస్తుంది.

● నరాలకు చెందిన మైలిన్‌ పొర పాడై నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. తిమ్మిర్లు వస్తాయి, కాళ్లు, చేతులు చచ్చుబడిపోవ డం, నడవలేకపోతుంటారు.

● మాట్లాడేటప్పుడు, నడిచేటప్పుడు బ్యాలెన్స్‌ ఉండదు.

● గుండె స్పందన రేటు పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది.

● నడిచేటప్పుడు విపరీతమైన అలసటకు గురవుతారు.

● జీర్ణశక్తి తీవ్రంగా దెబ్బతింటుంది.

● కొన్నిసార్లు ఊపిరితీసుకునే కండరాలు బలహీనపడతాయి. ఊపిరితిత్తులకు సంబ ంధించి పార్శ్వ న్యూమోథొరాక్స్‌ వస్తుంది.

● ఈ కారణంగా ఊపిరితీసుకోలేక రోగి మరణించే అవకాశం ఉంటుంది

ఏడాదిలో 21 మందికి

చికిత్స చేశాం

జీజీహెచ్‌లోని న్యూరాలజీ విభాగంలో గత యేడాది కాలంలో 21 మంది జీబీ సిండ్రోమ్‌ బాధితులకు చికిత్స అందించాం. ఒక్క గత జనవరి మాసంలో ముగ్గురికి వైద్యమందించాం. ఇలాంటి వారికి వ్యాధి లక్షణాలను బట్టి చికిత్స అందించడంతో పాటు ప్లాస్మాథెరపి లేదా ఇమ్యునోగ్లోబ్లిన్స్‌ చికిత్స అందజేస్తున్నాం. ఇమ్యున్లోగ్లోబిన్స్‌ ఇంజెక్షన్లు ఐదు రోజుల పాటు ఇవ్వడం వల్ల వ్యాధి పెరగకుండా నియంత్రిస్తుంది. దీనివల్ల రోగి త్వరగా కోలుకుంటాడు.

– డాక్టర్‌ సి.శ్రీనివాసులు, హెచ్‌వోడీ,

న్యూరాలజీ విభాగం, జీజీహెచ్‌ కర్నూలు

స్థానికంగా ఇమ్యునోగ్లోబిన్స్‌

కొంటున్నాం

ఆసుపత్రికి వచ్చే జీబీ సిండ్రోమ్‌ కేసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చికిత్స అందిస్తున్నాం. వారు మందులు, వ్యాధినిర్ధారణ పరీక్షలకు బయటకు వెళ్లాల్సిన పనిలేకుండా అన్నీ మేము అందిస్తున్నాం. ముఖ్యంగా అత్యంత ఖరీదైన ఇమ్యునోగ్లోబిన్స్‌ ఇంజెక్షన్లు గతంలో సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి సరఫరా అయ్యేవి. కొన్ని నెలలుగా వాటి సరఫరా లేకపోవడంతో ఉన్నతాధికారుల అనుమతితో స్థానికంగా కొనుగోలు చేసి రోగులకు అందిస్తున్నాం. దీనివల్ల రోగులు త్వరగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతున్నారు. – డాక్టర్‌ కె. వెంకటేశ్వర్లు,

సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌, కర్నూలు

కర్నూలు(హాస్పిటల్‌): దేశాన్ని కలవరపెడుతున్న జీబీ సిండ్రోమ్‌ వ్యాధికి సంబంధించిన కేసులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతి నెలా రెండు, మూడు వస్తూనే ఉన్నాయి. గతేడాది జనవరి నుంచి గత నెల జనవరి వరకు 48 మంది రోగులు ఈ వ్యాధితో చికిత్స పొందారు. ఈ ఆసుపత్రికి కర్నూలు జిల్లాతో పాటు నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్‌, అన్నమయ్య, ప్రకాశం జిల్లాలతో పాటు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి చికిత్స కోసం వస్తున్నారు. వీరిలో జీబీ సిండ్రోమ్‌తో బాధపడే వారూ ఉన్నారు. పక్షవాతం వలే ఈ వ్యాధితో బాధపడేవారు త్వరగా కోలుకునే పరిస్థితి ఉండదు. అందుకే ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఈ రోగులను చేర్చుకోవడం లేదు. ఎక్కువ శాతం ప్రభుత్వ ఆసుపత్రికే రెఫర్‌ చేస్తున్నారు. ఈ కారణంగా ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగం, న్యూరాలజీ విభాగం, జనరల్‌ మెడిసిన్‌ విభాగాల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాధికి ఖరీదైన ఇమ్యునోగ్లోబిన్స్‌ ఇంజెక్షన్లు వాడాల్సి ఉంటుంది. వీటి ఖరీదు ఒక్కోటి రూ.11వేల నుంచి రూ.15వేల వరకు ఉన్నాయి. వీటిని జీబీ సిండ్రోమ్‌తో పాటు తలసీమియా, తీవ్ర వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌లతో బాధపడే వారికి ఇస్తారు. ఆయా రోగుల పరిస్థితిని బట్టి ఐదు రోజుల పాటు ఇస్తారు. పేదరోగుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా గత ప్రభుత్వం వీటిని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ల నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేసేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటి సరఫరా నిలిపివేసింది. ఆసుపత్రి అధికారులు మందులు కావాలని పలుమార్లు ఇండెంట్‌ పెడుతున్నా స్పందన లేదు. దీంతో స్థానికంగా మందులను కొనుగోలు చేసి రోగులకు అందిస్తున్నారు. ఈ మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రతి నెలా 20 నుంచి 25 మందికి ఈ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఈ ఇంజెక్షన్‌తో పాటు ప్లాస్మాపెరోసిస్‌ చికిత్స చేస్తారు. మొత్తంగా జీబీ సిండ్రోమ్‌ వచ్చిన రోగికి చికిత్స చేయాలంటే రూ.5లక్షల నుంచి రూ.10లక్షల దాకా ఖర్చు అవుతుందని వైద్యుల అంచనా.

జీబీ సిండ్రోమ్‌కు పరీక్షలేవి?

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జీబీ సిండ్రోమ్‌ వ్యాధిని నిర్ధారించే పరీక్షలు ఏవీ చేయడం లేదు. కేవలం వ్యాధి లక్షణాలను బట్టి వైద్యులు చికిత్స అంది స్తున్నారు. వాస్తవంగా ఈ వ్యాధి నిర్ధారణకు ఈఎన్‌ఎంజీ, ఎన్‌సీఎస్‌ పరీక్షలు చేయాల్సి ఉంది. ఇవి చాలా ఖరీదైనవి. ఎక్కువగా పేదరోగులు చికిత్స కోసం వస్తుండటంతో పరీక్షలకు రాయకుండా లక్షణాలను బట్టి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఇది ఇమ్యునులాజికల్‌ ఇమ్మీడియట్‌ డిజార్డర్‌గా వైద్యులు పరిగణిస్తారు. మన శరీరంలో ఉండే రక్షణ వ్యవస్థ (వ్యాధినిరోధక శక్తి) శత్రుకణాలుగా భ్రమపడి సొంత వ్యాధి నిరోధక శక్తిని కలిగించే కణాలపై దాడి చేయడం వల్లే ఈ వ్యాధి సోకుతోంది. ఈ కారణంగా మన వ్యాధి నిరోధక వ్యవస్థ దెబ్బతింటోంది. నాడీ వ్యవస్థపై దాడి చేయడానికి జీబీ సిండ్రోమ్‌ ప్రేరేపిస్తుంది. ఈ కారణంగా పక్షవాతానికి గురవుతున్నారు. ఇది రావడానికి ఎక్కువగా ఇన్‌ఫెక్షన్లు లేదా కారణం లేకుండా కూడా వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధిలో ఐదు గ్రేడ్‌లు ఉంటాయి. మొదటి గ్రేడ్‌లో రోగులు సాధారణంగా నడుస్తారు. రెండో గ్రేడ్‌లో ఎవ్వరైనా పట్టుకుంటేనే నడవగలుగుతారు. మూడో గ్రేడ్‌లో పట్టుకున్నా నడవలేరు. నాలుగో గ్రేడ్‌లో బెడ్‌కే పరిమితమై ఉంటారు. ఐదో గ్రేడ్‌లో ఆసుపత్రిలోని వెంటిలేటర్‌పై ఉంటారు. ఆరోగ్రేడ్‌లో మరణిస్తారని వైద్యులు తెలిపారు.

కోవిడ్‌ అనంతరం పెరిగిన కేసులు

జీబీ సిండ్రోమ్‌ వ్యాధిగ్రస్తులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు గతంలో అరుదుగా చికిత్స కోసం వచ్చేవారు. కానీ కోవిడ్‌–19 అనంతరం వైరస్‌ లేదా వ్యాక్సిన్‌ వల్ల ఈ కేసుల సంఖ్య పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. ఉత్తర భారత దేశంలో ఇలాంటి కేసులు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. చండీఘర్‌లోని పీజీఐ వారు ఇందుకు సంబంధించిన స్టడీస్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు.

గత జనవరి నెల 18వ తేదీన కర్నూలు నగరంలోని కల్లూరు ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలుడు జీబీ సిండ్రోమ్‌ లక్షణాలు కనిపించాయి. అతన్ని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అదే నెల 20వ తేదీన చిన్నపిల్లల విభాగంలో చేర్పించారు. వైద్యులు మెరుగైన వైద్యం అందించడంతో బాలుడు కోలుకున్నాడు.

మండల కేంద్రమైన గూడూరులోని కాప స్ట్రీట్‌కు చెందిన మూడేళ్ల బాలుడికి గత నవంబర్‌ 27వ తేదీన జీబీ సిండ్రోమ్‌ లక్షణాలు కనిపించడంతో అదే నెల 30వ తేదీన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు చిన్నారికి సకాలంలో వైద్యం అందించడంతో కోలుకుని క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు.

జీబీ సిండ్రోమ్‌ అంటే..

గత ఏడాది నుంచి జీజీహెచ్‌లో

48 మందికి చికిత్స

వీరి చికిత్సలో ఇమ్యునోగ్లోబిన్స్‌

ఇంజెక్షన్లు కీలకం

మూడు నెలలుగా ఆగిపోయిన

ఇంజెక్షన్ల సరఫరా

స్థానికంగా కొనుగోలు చేస్తున్న

పెద్దాసుపత్రి అధికారులు

వ్యాధి పట్ల భయం అవసరం

లేదంటున్న వైద్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
ఉన్నట్లుండి జ్వరం వస్తుంది. క్రమంగా తల నుంచి పాదాల వరకు1
1/3

ఉన్నట్లుండి జ్వరం వస్తుంది. క్రమంగా తల నుంచి పాదాల వరకు

ఉన్నట్లుండి జ్వరం వస్తుంది. క్రమంగా తల నుంచి పాదాల వరకు2
2/3

ఉన్నట్లుండి జ్వరం వస్తుంది. క్రమంగా తల నుంచి పాదాల వరకు

ఉన్నట్లుండి జ్వరం వస్తుంది. క్రమంగా తల నుంచి పాదాల వరకు3
3/3

ఉన్నట్లుండి జ్వరం వస్తుంది. క్రమంగా తల నుంచి పాదాల వరకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement