మిరపపంట రైతన్నల కంట్లో కారం కొట్టింది. ఎన్నో ఆశలతో పంట
సమష్టిగా ఆర్‌యూ అభివృద్ధికి కృషి
● నూతన వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వెంకట బసవరావు
కర్నూలు కల్చరల్: సమష్టిగా రాయలసీమ యూనివర్సిటీని అభివృద్ధి చేద్దామని వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి. వెంకట బసవ రావు అన్నారు. బుధవారం వీసీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ విజయకుమార్ నాయుడు, వర్సిటీ సైన్స్, ఆర్ట్స్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆచార్య సీవీ కృష్ణారెడ్డి, ఆచార్య ఎన్.నరసింహులు, డీన్ ఆప్ ఎగ్గామినేషన్స్ ఆచార్య పీవీ సుందరానంద్, రీసర్స్ డైరెక్టర్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య ఆర్. భరత్‌కుమార్ ఆర్‌యూసీఈ ప్రిన్సిపాల్ డాక్టర్ హరి ప్రసాద్ రెడ్డి తదితరులు నూతన వీసీని కలిసి బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రాబోయే మూడేళ్లలో విశ్వవిద్యాలయం అభివృద్ధికి పారదర్శకంగా ఉంటూ శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. వర్సిటీలో జరిగే ప్రతి విషయాన్ని సమాజం గమనిస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాలన్నారు. అకడమిక్ క్యాలండర్‌ను తప్పనిసరిగా పాటించాలన్నారు. వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
చాపిరేవుల సమీపంలో మిర్చి దిగుబడిని ఆరబెట్టన దృశ్యం
మిరపపంట రైతన్నల కంట్లో కారం కొట్టింది. ఎన్నో ఆశలతో పంట
Comments
Please login to add a commentAdd a comment