టీడీపీ డీలరా.. మజాకా..!
పగిడ్యాల: పేద ప్రజలకు చౌకదుకాణాల ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం పంపిణీలో డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కార్డుదారుల వేలిముద్రలను తీసుకుని బియ్యం వేయకుండా మోసం చేసిన వైనం పడమర ప్రాతకోట గ్రామం 21వ షాపు పరిధిలో వెలుగు చూసింది. గత జగనన్న ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ ఇంటింటికి పంపిణీ చేయగా.. కూటమి ప్రభుత్వం అధికార పార్టీ నేతలను డీలర్లు మార్చి పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తోంది. ఇందుకు పడమర ప్రాతకోట 21వ షాపు నిర్వాకుడే నిదర్శనం. ఈ షాపు పరిధిలో 709 కార్డులు ఉన్నా యి. ప్రతి నెల ఏఏవై కార్‌ుడ్సకు 13.30 క్వింటాళ్లు, తెల్లరేషన్‌కార్డులకు 90.50 క్వింటాళ్లు కాగా క్లోజింగ్ బ్యాలెన్స్ (సీబీ) పోగా ఓపెనింగ్ బ్యాలెన్స్ 55.84 క్వింటాళ్లు సరాఫరా చేస్తున్నామని సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ నివేదిక అందజేశారు. కార్డుదారులకు టోకరా కొట్టేందుకే ఎండీయూ వాహన డ్రైవర్‌తో బయోమెట్రిక్ మిషన్ ఆన్ చేయించుకుని డీల ర్లే స్వయంగా కార్డుదారుల థంబ్ తీసుకుని బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ప్రభుత్వం మాది మేము బియ్యం పంచుకుంటాం.. కేవలం థంబ్ వేయించి పోండి’ అంటూ ఎండీయూ డ్రైవర్‌లపై డీలర్లు పెత్తనం చెలాయిస్తున్నట్లు సమాచారం. అందుకే ఫిబ్రవరి నెలకు సంబంధించి బియ్యం కోటా తక్కువ వచ్చిందని మార్చి నెలలో రెండు నెలల బియ్యం ఒకేసారి వేస్తానని కార్డుదారుల వేలిముద్రలు తీసుకుని దాదాపు 80 ప్యాకెట్ల బియ్యాన్ని డీలర్ మాయం చేసినట్లు సమాచారం. ఎక్కువగా 20 కేజీలు, 25 కేజీలు, 35 కేజీలు కలిగిన కార్డుదారుల వ్రేలిముద్రలను తీసుకుని బియ్యం వేయనట్లు తెలుస్తోంది. పేదల నోటి కాడి బియ్యాన్ని పక్కదారి పట్టించిన అధికార పార్టీ డీలర్‌పై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.
బియ్యం వేయకుండానే వేలిముద్రలు తీసుకున్నాడు
పోయిన నెలలో నా కార్డుకు బియ్యం వేసి మా కొడుకుల కార్డులకు బియ్యం వేయలేదు. వేలిముద్రలు తీసుకున్నావ్ కదా అని అడిగితే వచ్చే నెలలో వేస్తానని చెప్పినాడు. ఈనెల బండి ఇంకా రాలేదు.
– హజరాంబీ, పడమర ప్రాతకోట
5 కేజీలు, 10 కేజీల కార్డులకు
మాత్రమే వేశారు
కార్డులో ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఉన్న వాళ్లకు మాత్రమే 5 కేజీలు, 10, 15 కేజీల బియ్యం వేశారు. 20, 25, 30 కేజీల ఉన్న వారికి ఇవ్వలేదు. నా కొడు కు తలారి అయినా బియ్యం వేయలేదు. ముస్లిం కాలనీలో చాలా మందికి వేయలేదు. రెండు నెలల బియ్యం వేస్తానని వ్రేలిముద్రలు వేయించుకున్నాడు.
– మొల్ల జైబున్‌బీ,పడమర ప్రాతకోట
నా దృష్టికి రాలేదు
పడమర ప్రాతకోటలోని 21వ షాపు డీలర్ బియ్యం సరిగా పంపిణీ చేయని విషయం నా దృష్టికి రాలేదు. మార్చి నెల కోటా బియ్యం పంపిణీ జరుగుతోంది. ఆర్‌ఐతో విచారణ చేయించి రెండు నెలల బియ్యం వేసేలా చర్యలు తీసుకుంటాం.
– శివరాముడు, తహసీల్దార్, పగిడ్యాల
వినియోగదారుల థంబ్ తీసుకుని
రేషన్ ఇవ్వని వైనం
ఫిబ్రవరి నెలలో దాదాపు 80 బస్తాల
బియ్యం మాయం
లబోదిబోమంటున్న కార్డుదారులు
Comments
Please login to add a commentAdd a comment