రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతి
పత్తికొండ రూరల్/ఆస్పరి: రోడ్డు ప్రమాదంలో పందికోన గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త పందుల బాలరాజు (34) మృతి చెందారు. వైఎస్సార్‌సీపీ కార్యక్రమాల్లో బాలరాజు చురుగ్గా పాల్గొనేవాడు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అభిమానంతో ముగ్గురు సంతానంలో పెద్దకుమార్తె పేరు షర్మిల, చిన్నకుమారుడి పేరు జగన్ అని పెట్టుకున్నారు. ఆస్పరి మండలం కై రుప్పల సమీపంలో ఆదివారం దేవరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆటోలో వస్తూ అదుపుతప్పి ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. చికిత్స నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. బాలరాజు మృతితో భార్య సరోజ, బంధువులు బోరున విలపించారు. మృతి వార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సోమవారం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతి
Comments
Please login to add a commentAdd a comment