రాళ్ల ట్రాక్టర్ బోల్తా పడి బాలుడి మృతి
పాములపాడు: మండలంలోని చెలిమల గ్రామ సమీపంలో రాళ్ల ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. లింగాల గ్రామానికి చెందిన మోహన్రావు కుమారుడు జస్వంత్ (17) 9వ తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం పని మీద పాములపాడుకు వచ్చిన జస్వంత్ తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి వెళ్తున్న రాళ్ల లోడు ట్రాక్టర్ ఎక్కాడు. మార్గమధ్యలో చెలిమిల గ్రామ సమీపంలో ఎద్దుల వంక వాగు వద్ద ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో రాళ్లపై కూర్చున్న బాలుడు జస్వంత్పై రాళ్లుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో బాలుడు సంగీత రాజు క్షేమంగా బయటపడ్డాడు. ప్రస్తుతం డ్రైవర్ స్వాములు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు.
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
కొలిమిగుండ్ల: నందిపాడుకు చెందిన గుండ్ర గుర్రప్ప(48) అప్పుల బాధతో సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ బాబా ప్రకృద్దీన్ తెలిపారు. గుర్రప్ప నాపరాళ్ల వ్యాపారం చేస్తూ నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. కుమారుడు చదువు, కుమార్తె వివాహం కోసం ఫైనాన్స్ సంస్థల వద్ద రూ.9లక్షలు అప్పు చేశాడు. ఇందులో రూ.3 లక్షలు వాయిదాల రూపంలో చెల్లించాడు. మిగిలిన బకాయి చెల్లించే అవకాశం లేక ఆర్థిక సమస్యలతో సతమతమయ్యాడు. దీతో మనస్తాపం చెంది తిమ్మనాయినపేట జంక్షన్ సమీపంలోని పొలంలోకి వెళ్లి శనగ మాత్రలు మింగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు గుర్తించి తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.
చెట్టుపై నుంచి కిందపడి యువకుడి మృతి
ఆదోని అర్బన్: పెద్దకడబూరు మండలం నెమలికల్లు గ్రామానికి చెందిన అల్తాఫ్(26) అనే యువకుడు చెట్టుపై నుంచి కిందపడి సోమవారం మృతిచెందాడు. బంధువులు తెలిపిన వివరాలు మేరకు .. ఉదయం పొలంలోని టెంకాయ చెట్టు ఎక్కి టెంకాయలను తెంపుతుండగా అకస్మాత్తుగా పై నుంచి కింద పడ్డాడు. కిందకు పడిన యువకుడిని వెంటనే స్థానికులు ఆదోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే అల్తాఫ్ మృతిచెందాడు. మృతుడికి భార్య సునీత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడు వలస వెళ్లి ఇటీవలే గ్రామానికి చేరుకున్నాడు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో రోదనలు మిన్నంటాయి.
రాళ్ల ట్రాక్టర్ బోల్తా పడి బాలుడి మృతి
రాళ్ల ట్రాక్టర్ బోల్తా పడి బాలుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment