ఎమ్మెల్యే చెబితేనే కమిటీలో స్థానం
● తేల్చి చెప్పిన వాటర్‌షెడ్ అధికారిణి ● వాగ్వాదానికి దిగిన యాపదిన్నె సర్పంచ్
డోన్: వాటర్‌షెడ్ పనుల్లో రాజకీయ జోక్యం పెరిగిపోతుంది. కోట్లాది రూపాయల పనులను పారదర్శకంగా చేపట్టేందుకు ఏర్పాటు చేయాల్సిన కమిటీల్లో ఎమ్మెల్యే సూచించిన వారికే ప్రాధాన్యత ఉంటుందని ఏకంగా అధికారులు చెబుతుండటం గమనార్హం. ఈ విషయంలో మంగళవారం డోన్ ఎంపీడీఓ కార్యాలయంలో వాటర్‌షెడ్ అధికారిణి విజేత, యాపదిన్నె సర్పంచ్ రామిరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాటర్ షెడ్ కమిటీలో టీడీపీ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాల గురించి తాము అమరావతికి వెళ్లి లిఖితపూర్వకంగా సీఎం చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశామన్నారు. పార్టీని నమ్ముకుని తాము అన్నివిధాలా నష్టపోయామని, సర్పంచ్ ఎన్నికల్లో గెలిచి పేరు నిలబెడితే తమను ప్రజల ముందు హేళన చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో కొందరు అధికారులు జోక్యం చేసుకొని ఏదైనా ఉంటే ఎమ్మెల్యేతో మాట్లాడుకోవాలని సర్దిచెప్పి పంపడం గమనార్హం. అయితే తన పట్ల అమర్యాదగా మాట్లాడిన సర్పంచ్‌పై కలెక్టర్, డ్వామా పీడీకి ఫిర్యాదు చేస్తున్నట్లు వాటర్‌షెడ్ అధికారిణి విజేత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment