యువనేస్తం.. నిలువునా మోసం | - | Sakshi
Sakshi News home page

యువనేస్తం.. నిలువునా మోసం

Published Wed, Mar 12 2025 7:42 AM | Last Updated on Wed, Mar 12 2025 7:38 AM

యువనే

యువనేస్తం.. నిలువునా మోసం

ఉద్దేశపూర్వకంగా బకాయిలు

పేద విద్యార్థులను దూరం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫీజు బకాయిలు పెడుతుంది. కార్పొరేట్‌ విద్యాసంస్థలను ప్రోత్సహించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. వసతి దీవెన, విద్యాదీవెన నిలిపి వేసి డిగ్రీ, ఇంజనీరింగ్‌, డాక్టర్‌ చదువుల కలలను నీరుగార్చే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది.

– ఎంఆర్‌ నాయక్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి, నంద్యాల

పేద విద్యార్థులకు అన్యాయం

కూటమి ప్రభుత్వం మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెండింగ్‌లో పెట్టి పేద విద్యార్థులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఫీజు కట్టకపోవడంతో కాలేజీల నుంచి విద్యార్థులను పరీక్షలు రాయించకుండా వెళ్లగొడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో చదువులు మధ్యలో ఆగిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంఇ.

– నాగరాముడు, ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, నంద్యాల

విద్యా వ్యవస్థను నీరుగారుస్తోంది

కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నీరుగారుస్తోంది. మళ్లీ ఐదేళ్లు కష్టాలను చవి చూడాల్సి వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు ఫీజులు చెల్లించాలంటే ఇబ్బందిగా మారుతుంది. ప్రభుత్వం ఇప్పటి కైనా దిగి వచ్చి విద్యార్థులకు న్యాయం చేయాలి.

– రాజు, విద్యార్థి సంఘం

అధ్యక్షుడు, నంద్యాల

నంద్యాల: గత ఐదేళ్ల పాటు నిశ్చితంగా ఉన్న విద్యారంగం నేడు కూటమి ప్రభుత్వంలో ఒడిదుడుకులకు గురవుతోంది. మళ్లీ గత టీడీపీ పాలనలోని కష్టాలను చవి చూడాల్సి వస్తుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పేరుతో విద్యార్థులకు ఆర్థికంగా ఆదుకుంటూ వచ్చింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పథకాలకు పేర్లు మార్చి చేతులెత్తేసింది. ఏటా చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెనపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. పేద మధ్య తరగతి వర్గాలకు చెందిన తల్లిదండ్రులకు రూ. వేలకు వేలు ఫీజు చెల్లించడం ఇబ్బందిగా మారింది. కూటమి ప్రభుత్వం ఫీజు చెల్లింపులో ఎలాంటి స్పష్టత ఇవ్వక పోవడంతో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ తదితర కోర్సులు చేస్తున్న విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో దాదాపు 38 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు, క్రిస్టియన్‌ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి కూటమి ప్రభుత్వం మూడు విడతలుగా దాదాపు రూ.73 కోట్లు బకాయి పడింది. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్యకు ఎలాంటి ఆటంకం కల్పించబోమని, ఎప్పటికప్పుడు ఫీజులను విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నా ఫీజు బకాయిలపై దృష్టి సారించడం లేదు.

జగనన్న పాలనలో ఇలా..

గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రవేశ పెట్టిన సమయంలో బీసీ, ఈబీసీ, మైనార్టీ, కాపు విద్యార్థుల ఇంజినీరింగ్‌ విద్యకు ఏడాదికి రూ.35వేలు మాత్రమే విడుదలయ్యేవి. కానీ కొన్ని పెద్ద కళాశాలల్లో (గ్రేడ్‌–1) ఇంజినీరింగ్‌ ఫీజు ఏడాదికి రూ.60వేల నుంచి రూ. 80వేల వరకు ఉంది. ఆయా కళాశాలల్లో చదువుతున్న సంబంధిత సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వం విడుదల చేసే రూ.35 వేలను మినహాయించి మిగిలిన ఫీజు వారి తల్లిదండ్రులే చెల్లించాల్సి వచ్చే ది. ఈ ఆర్థిక భారాన్ని కూడా తొలగించేందుకు అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని పెంచాలని నిర్ణయం తీసుకుని అమలు చేశారు. జగనన్న విద్యాదీవెన పేరుతో ఆయా విశ్వవిద్యాలయాలు నిర్ణయించిన ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రేడ్‌–1 కళాశాలల్లో అనేక మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ తదితర కోర్సులను ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తి చేసి కుటుంబాలకు ఆసరాగా నిలిచారు. ఐదేళ్ల జిల్లాలో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.498.50 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేశారు.

బకాయిలు చెల్లించిన జగన్‌ సర్కార్‌..

గత టీడీపీ ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను కూడా వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం 2019–20 విద్యా సంవత్సరంలో విడుదలయ్యా యి. వసతి దీవెన పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ విద్యార్థులకు రూ.23 వేలు అందించింది.

ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో వైద్య రంగానికి పెద్దపీట వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు నిర్మాణాలను కూడా ప్రారంభించారు. అందులో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని, నంద్యాల ప్రాంతాల్లో మెడికల్‌ కళాశాలల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. నంద్యాలలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రారంభం కాగా, ఆదోనిలో చురుగ్గా జరుగుతున్న మెడికల్‌ కళాశాల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం మోకాలడ్డువేసింది. కరువు ప్రాంతమైన ఆదోనిలో మెడికల్‌ కళాశాల నిర్మాణానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో దాదాపు 80 శాతం నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. మిగిలిన 20 శాతం పనులు పూర్తియితే ఈ ఏడాది 150 సీట్లతో కళాశాల ప్రారంభయ్యేది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిర్మాణాలకు బ్రేకులు వేసింది. దీంతో ఆదోని మెడికల్‌ కళాశాల కలగానే మిగిలిపోయింది. పైపెచ్చు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన మెడికల్‌ కళాశాలలను ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

వైద్య విద్యకు మోకాలడ్డు

నారా లోకేష్‌ నోరు విప్పాలి

విద్యాశాఖ మంత్రి నారాలోకేష్‌ యువగళం పాదయాత్రలో ఫీజురీయింబర్స్‌మెంట్‌పై ఇచ్చిన హామీలు ఇంత వరకు నోరు విప్పడం లేదు. పెండింగ్‌లో నిధులను మంజూరు చేసే విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే సహించేది లేదు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడతాం.

– సురేష్‌యాదవ్‌, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు, నంద్యాల

రూ.2,142,16 కోట్లు

అమలు చేయకపోతే ఏడాది నష్టం

5,95,045

జిల్లాలోని గృహాల సంఖ్య

రూ.178.51 కోట్లు

నెలకు రూ.3వేల చొప్పున చెల్లించాల్సిన నిరుద్యోగ భృతి

నేడు వైఎస్సార్‌సీపీ యువత పోరు

విద్యార్థులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈనెల 12వ తేదీన వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో యువత పోరు నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అద్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి తెలిపారు. ఫీజు బకాయిలు వెంటనే చెల్లించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. విద్యార్థులతో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనున్నామన్నారు. కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం విద్యార్థుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తామన్నారు.

చంద్రబాబుకు నిరుద్యోగులను మోసం చేయడం ఆనవాయితీగా మారింది. 2014లో కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తానని, అప్పట్లో రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీని చెత్తబుట్టలో పడేశారు. 2019 ఎన్నిలకు ముందు రాజకీయ లబ్ధి కోసం 2018 అక్టోబర్‌ నుంచి నెలకు రూ.వెయ్యి కొంతమందికి మాత్రమే నిరుద్యోగ భృతి వేసి చేతులుదులుపుకున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తానని, ఉద్యోగం ఇచ్చే వరకూ ‘యువనేస్తం’ పేరిట నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఈ లెక్కన జిల్లాలో నెలకు రూ.178.51 కోట్లు ఇవ్వాలి. ‘కూటమి’ మాటలు నమ్మి ఉద్యోగాలపై ఆశతో కోచింగ్‌ సెంటర్లకు వెళ్లే విద్యార్థులకు ప్రతి నెలా వేల రూపాయలు ఖర్చవుతోంది. ప్రభుత్వం భృతి ఇవ్వకపోవడంతో వారిపై భారీగా ఆర్థిక భారం పడుతోంది. ఓ వైపు ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. మరో వైపు భృతి లేకపోవడంతో నిరుద్యోగులు ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
యువనేస్తం.. నిలువునా మోసం 
1
1/5

యువనేస్తం.. నిలువునా మోసం

యువనేస్తం.. నిలువునా మోసం 
2
2/5

యువనేస్తం.. నిలువునా మోసం

యువనేస్తం.. నిలువునా మోసం 
3
3/5

యువనేస్తం.. నిలువునా మోసం

యువనేస్తం.. నిలువునా మోసం 
4
4/5

యువనేస్తం.. నిలువునా మోసం

యువనేస్తం.. నిలువునా మోసం 
5
5/5

యువనేస్తం.. నిలువునా మోసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement