కుంభోత్సవానికి కొబ్బరికాయల సమర్పణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి వచ్చే నెల 15వ తేదీన కుంభోత్సవం నిర్వహించనున్నా రు. అమ్మవారికి సాత్వికబలి నిర్వహించేందుకు కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు మొదలైనవి సమర్పిస్తారు. కుంభోత్సవం రోజున సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం, శుక్ర వారం రోజుల్లో అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించడం అనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఆలయ ఉద్యోగి మంగళవారం కొబ్బరికాయలు సమర్పించారు. అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి, పసుపు, కుంకుమలతో వాటికి పూజాలు జరిపారు. అనంతరం అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించారు.
చౌడేశ్వరిదేవి హుండీ ఆదాయం రూ. 25.93 లక్షలు
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయ హుండీ లెక్కింపు ద్వారా రూ.25.93 లక్షల ఆదాయం లభించింది. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్ప టి వరకు భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. రూ.25,93,789 నగదు, 37.25 గ్రాముల బంగారు, కిలోన్నర వెండి వచ్చిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణాధికారి హరిశ్చంద్రారెడ్డి, ఏపీజీబీ బ్యాంకు సిబ్బంది, ఆళ్లగడ్డ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
660 మంది
విద్యార్థులు గైర్హాజరు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలకు 660 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 53 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు జనరల్ విద్యార్థులు 15,110 మందికి గాను 14,563 మంది విద్యార్థులు హాజరు కాగా 547 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ పరీక్షకు 1,494 మందికి గాను 1,381 మంది హాజరు కాగా 113 మంది గైర్హాజరయ్యారు.
మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా రంగనాథరావు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా వి.వి.రంగనాథరావు నియమితులయ్యారు. ఈయన నెల్లూరు జిల్లాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలనే ప్రభుత్వం డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించి కర్నూలుకు బదిలీ చేసింది. నంద్యాల లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న శ్యామల కర్నూలులో మూడేళ్లకుపైగా పూర్తి అదనపు బాధ్యతలతో జేడీగా పనిచేశారు. జిల్లా విభజన తర్వాత ఎఫ్‌ఏసీపై ఇక్కడే డీడీగా పనిచేస్తున్నారు. కర్నూలు డీడీ పోస్టు ఖాళీగా ఉండటంతో ఈ స్థానంలో రంగనాథరావును నియమి స్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన రెండు, మూడు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఇక్కడ జేడీ, డీడీ హోదాలో పనిచేసిన శ్యామల నంద్యాలలో ఏడీగానే కొనసాగనున్నారు.
కుంభోత్సవానికి కొబ్బరికాయల సమర్పణ
Comments
Please login to add a commentAdd a comment