మాకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన పొలం ఆస్తిగా ఉంది. రికార్డుల ప్రకారం అడంగల్‌లో వారసత్వం ఉండగా వన్‌బీలో దానం కింద నమోదు అయి ఉంది. మాకు వారత్వం ఆస్తిగా మార్చాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. 2023లో వన్‌బీలో వారసత్వం ఉండగా 2025లో అదే ఆస్తి దానం కింద వన్‌బీలో నమోదు అయి ఉంది. ఈ రికార్డులన్నీ మాకు తెలియకుండానే అధికారులు మార్పు చేస్తున్నారు. మాకు ఎవరు న్యాయం చేస్తారు. –కురువ రామలింగడు, యాపదిన్నె, డోన్ మండలం