పాఠశాలలకు సెలవులొస్తున్నాయంటే పిల్లల ఆనందానికి అవధులు ఉండవు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం మంది పిల్లలు వేసవికాలంలో బావులు, కుంటలు, చెరువుల్లో ఈత కొట్టేందుకు మక్కువ చూపిస్తారు. అవి లోతు ఎక్కువగా ఉంటాయన్న అవగాహన ఉండదు. ఈత రాదనే ఆలోచన రాదు. ఈ కారణంగానే ఈతకు వెళ్లిన పిల్లలు నీట మునిగి ఊపిరాడక మృత్యువాత పడుతున్నారు. సెలవుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పాఠశాలల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల రోజువారీ కార్యక్రమాలను గమనిస్తుండాలి.
– డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, చిన్న పిల్లల వైద్యనిపుణుడు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కోవెలకుంట్ల
తల్లిదండ్రులు
అప్రమత్తంగా ఉండాలి
సెలవుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలి. నది, బావులు, కుంటల్లో ఈతకు వెళ్లకుండా గమనిస్తుండాలి. ఒక వేళ ఈత కొట్టాలని పిల్లలు మారం చేస్తే సాధ్యమై నంత వరకు ఆ ఆలోచన నుంచి వారిని మళ్లించాలి. అవసరమైతే వారితో పాటు పెద్దలు కూడా వెళ్లాలి. ఈతకు బదులు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆడుకునే ఆటలవైపు దృష్టి మళ్లేలా అవగాహన కల్పించాలి.
– జీవీ సుబ్బారెడ్డి, రిటైర్డ్ హెచ్‌ఎం, కోవెలకుంట్ల
క్రీడలతో పాటు ఈత నేర్పించాలి
ప్లిలలకు వేసవి సెలవుల్లో క్రీడలతోపాటు ఈతలో శిక్షణ ఇప్పించాలి. విద్యార్థులకు చాలా మంది ఈత రాక ప్రమాదాల బారిన పడి మృత్యువాత చెందుతున్నారు. ఈత వచ్చిన వారి సమక్షంలో పిల్లలకు ఈత నేర్పించాలి. చెరువులో, నీటి కుంటల లోతు తెలియకుండా దిగవద్దు. డైవ్ చేయకూడదు. ఈత నేర్చుకునేవారు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లను ధరించాలి. అలసట వచ్చేంత వరకు ఎక్కువ దూరం ఈత కొట్టరాదు.
– ఉపేంద్ర, పీఈటీ, కోవెలకుంట్ల
పిల్లలను బావులు, నదుల వైపు పంపకూడదు
పిల్లలను బావులు, నదుల వైపు పంపకూడదు