విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరచాలి
గోస్పాడు: విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరచాలని జిల్లా విద్యాధికారి జనార్దన్ రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం దీబగుంట్ల, బాబా నగర్ పాఠశాలలను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, విద్యా ర్థులకు ప్రయోగాత్మక బోధనతో సులభంగా పాఠ్యాంశాలు అర్థమయ్యేలా చూడాలని సూచించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి వెనకబడిన విద్యార్థులను తీర్చిదిద్దాల న్నారు. మధ్యాహ్నం భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అనంతరం జాదూయి పిఠార మెటీరియల్‌ను విద్యార్థులకు అందించారు.
మద్దిలేటయ్య హుండీ ఆదాయం రూ.44.87 లక్షలు
బేతంచెర్ల: ఆర్‌ఎస్ రంగాపురం శివార్లలో వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి హుండీ ఆదాయం రూ.44.87 లక్షలు వచ్చింది. స్వామి, అమ్మ వార్లకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలు, ముడుపులను గురువారం లెక్కించారు. దేవదాయశాఖ అధికారి మోహన్ పర్యవేక్షణలో ఉప కమిషనర్, ఆలయ ఈఓ రామాంజనేయులు ఆధ్వర్యంలో 79 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు నిర్వహించారు. ఇందులో 44,87,441 నగదు, 8,50 మిల్లీ గ్రాముల బంగారు, 1.58 కేజీల వెండి వచ్చింది. కార్యక్రమంలో బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు, డోన్, బేతంచెర్ల మద్దిలేటి సేవా సమితి, వాసవీ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
నల్లబ్యాడ్జీలతో నిరసన
నంద్యాల(న్యూటౌన్): చిత్తూరు జిల్లాలో కులవివక్షకు పాల్పడిన అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక వాణిజ్య పన్నుల కార్యాలయం ఎదుట ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో గురువారం మధ్యాహ్న భోజన విరామంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా వాణిజ్య పన్నుల శాఖ సబ్ డివిజనల్ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథరెడ్డి కులవివక్షతతో ఉద్యోగులను అవమానించడం తగదన్నారు. భవిష్యత్తులో ఇలా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప, కోశాధికారి శ్రీనివాసులు, శ్రీనివాసులు, రిజ్వానా పర్వీన్, కోశాధికారి వెంకటచక్రదర్, సంయుక్త కార్యదర్శి ప్రభావతి, అసోసియేషన్ జిల్లా అద్యక్షుడు దశరథరామిరెడ్డి, కమలాకర్, నిర్మల జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరచాలి


