పొగమంచులో ప్రయాణం.. అప్రమత్తతే ప్రధానం
– మేఘా గాంధీ, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, నారాయణపేట
జిల్లాలో చలి తీవ్రత పెరగడం.. రాత్రి వేళల్లో పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. వాహనదారులు అప్రమత్తంగా వాహనాలు నడపాలని మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) మేఘా గాంధీ సూచించారు. పొగమంచు నేపథ్యంలో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
● చలికాలంలో వాహనాల్లో అర్ధరాత్రి తర్వాత, ఉదయం 8 గంటలలోపు దూర ప్రయాణాలు చేయకుండా ఉండడమే మంచిది. రాత్రి సమయాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో మాత్రమే ప్రయాణం చేయాలి. పొగమంచు అధికంగా కురుస్తుంటే రహదారిని చూడగలిగే పరిస్థితులకు అనుగుణంగా వేగం తగ్గించాలి. ఎదురుగా, వెనక వచ్చే వారికి స్పష్టంగా కనిపించేలా హెడ్‌లైట్లు, నాలుగు ఇండికేటర్లు వేసి ఉంచాలి. వాహనాల అద్దాలపై మంచు పొరను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలలి. వాహనాలను ఓవర్ టేక్ చేసే సమయంలో డిప్పర్ కొడుతూ రోడ్డు స్పష్టంగా కనిపిస్తేనే ముందుకు వెళ్లాలి. వాహనం నడిపే సమయంలో తాగడం, తినడం అస్సలు చేయకూడదు. డ్రైవింగ్‌పైనే దృష్టి సారించాలి.
– నారాయణపేట
Comments
Please login to add a commentAdd a comment